సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిరంజీవి ఆశీస్సులతో... తొలి అడుగు!

ABN, Publish Date - Mar 25 , 2026 | 03:14 PM

ప్రముఖ కథానాయకుడు, ఎపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ భార్య అన్నా లెజినోవా ఇన్ స్టాగ్రామ్‌లో ఖాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Anna Lezhinova

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ భార్య అన్నా లెజినోవా తొలిసారి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌ లో అన్నా కొణిదెల పేరుతో ఆమె ఖాతాను తెరిచారు. 'ఇది ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. చిరంజీవి గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్‌ మద్దతుతో ఇక్కడికి వచ్చాను' అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. భర్త పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఓ ఫోటోను ఆమె ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. తన భార్య అన్నా లెజినోవాకు పవన్ కళ్యాణ్‌ స్వాగతం పలికారు. ‘డియర్ అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం.. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటావని ఆశిస్తున్నాను’ అని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే... అన్నా లెజినోవా పేరు క్రింద 'రష్యన్‌ హార్ట్, ఇండియన్‌ సోల్‌' అనే పేర్కొనడం విశేషం. ఆమె సోషల్ మీడియాలోకి ఇలా అడుగుపెట్టిందో లేదో... వేల సంఖ్యలో పవన్ అభిమానులు ఆమెను ఫాలో కావడం మొదలు పెట్టేశారు. మొదటి గంటలోనే వారి సంఖ్య ఎనభై వేలకు పైగా ఉండటం విశేషం. బిజినెస్ మాగ్నెట్ కూడా అయిన అన్నా లెజినోవా... ఈ సోషల్ మీడియా ఖాతాను ఏ రకంగా ఉపయోగిస్తారని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 03:23 PM