సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓ అందాల రాక్షసి.. రీ-రిలీజ్

ABN, Publish Date - Apr 18 , 2026 | 07:44 AM

షెరాజ్ మెహదీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ అందాల రాక్షసి’ సినిమా ఏప్రిల్ 24న రీ-రిలీజ్ అవుతోంది.

O Andala Rakshasi

మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో విడుదలై మంచి స్పందన పొందిన ఈ సినిమా, ప్రేక్షకుల అభ్యర్థనతో ఏప్రిల్ 24న రీ-రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించి, అనంతరం మీడియాతో చిత్రబృందం ముచ్చటించింది.

ఈ వేడుకలో దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ, 'అమ్మాయిలపై జరుగుతున్న మోసాలు, అన్యాయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కథను తెరకెక్కించాను. ఇది గ్లామర్‌పై ఆధారపడిన సినిమా కాదు; బలమైన కథతో ముందుకు సాగే వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపిస్తూ, తప్పు చేసే వారికి తప్పనిసరిగా శిక్ష ఉంటుందనే సందేశాన్ని ఇస్తుంది. ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ థియేటర్ అనుభవంతో చూడాలనుకునే వారు తప్పక రీ-రిలీజ్ సందర్భంగా చూడాలి' అని తెలిపారు.

తెలుగులోనే కాకుండా కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. మహిళలపై వేధింపులు, నేరాలకు పాల్పడేవారికి తగిన శిక్ష ఎలా ఉండాలి? అలాంటి ఘటనల వల్ల వచ్చే పరిణామాలు ఏమిటి? అనే సామాజిక అంశాలను బలంగా ప్రస్తావిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాలో షెరాజ్ మెహదీ హీరోగా నటించగా, విహాన్షి హెగాడే, కృతి వర్మ హీరోయిన్లుగా కనిపించారు. నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, అనంత్ బాబు, ప్రియా కీలక పాత్రలు పోషించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మాతగా, తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా నిర్మితమైన ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా షెరాజ్ మెహదీ అందించడం విశేషం.

Updated Date - Apr 18 , 2026 | 09:57 AM