నైజీరియన్ కెన్నీ: వారణాసి నటుడు అరెస్ట్
ABN, Publish Date - Mar 14 , 2026 | 07:33 PM
ఎనిమిదేళ్లుగా అక్రమంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నైజీరియన్ విక్టరీ అపుయామగన్ అలియాస్ కెన్నీ (Kenny 34)ను కొండాపూర్‌లో ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది.
ఎనిమిదేళ్లుగా అక్రమంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నైజీరియన్ విక్టరీ అపుయామగన్ అలియాస్ కెన్నీ (Kenny 34)ను కొండాపూర్‌లో ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. ఘానా దేశానికి చెందిన కెన్నీ నకిలీ పాస్‌పోర్ట్‌తో ఇండియాలో దిగాడు. 2018లో మెడికల్ అటెండెంట్ వీసాతో ఢిల్లీకి వచ్చాడు. ఆ తర్వాత పంజాబ్‌లో జిమ్ ట్రైనర్‌గా పనిచేశాడు. 2025లో సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్‌కు చేరాడు. ఇప్పటి వరకు 5 సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవల విడుదలైన హిందీ మూవీ ‘తస్కరీ’ చిత్రంలో కూడా నటించాడు కెన్నీ. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిసింది. వీసా గడువు ముగిసినా భారత్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న కెన్నీని గుర్తించిన పోలీసులు ఫారినర్స్ రిజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అనుమతులతో స్వదేశానికి డిపోర్ట్ చేశారు.