సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కొంపల్లిలో కొత్త వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించిన నిధి అగర్వాల్

ABN, Publish Date - Aug 28 , 2026 | 07:43 PM

హైదరాబాద్ కొంపల్లిలో కలర్స్ హెల్త్‌కేర్ నూతన ‘కలర్స్ 2.0’ వెల్‌నెస్ సెంటర్‌ను హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు.

Nidhi Agarwal, Kolors 2.0,

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి నిధి అగ‌ర్వాల్‌. వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకెళుతుంది. తాజాగా ఈ భామ కొంప‌ల్లిలో సంద‌డి చేసింది. ప్రముఖ వెల్‌నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ వెల్‌నెస్ సెంటర్‌ను హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది.

ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో ఫిట్‌నెస్, అందంపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. కలర్స్ 2.0లో అత్యాధునిక టెక్నాలజీ, నిపుణులైన వైద్యులు, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండటం విశేషమని చెప్పారు. బరువు నియంత్రణ, చర్మం, జుట్టు సంబంధిత సమస్యలకు నిపుణుల సేవలు అవసరమని, అలాంటి వారికి ఈ తరహా వెల్‌నెస్ కేంద్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కలర్స్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన, ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణరాజ్ తుమ్మల మాట్లాడుతూ.. ప్రజల మారుతున్న జీవనశైలి, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా కొంపల్లి కేంద్రాన్ని అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాణ్యమైన వెల్‌నెస్ సేవలను అందించడమే తమ లక్ష్యమన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 09:09 PM