శ్రవణ్ రెడ్డి క్యారెక్టర్‌కు ఇన్ని లేయర్సా? ఎంఎస్ రాజు ఏమన్నారంటే!
ABN, Publish Date - Aug 18 , 2026 | 03:01 PM
హారర్ సినిమాలు అంటే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే నేపథ్య సంగీతం, ఊహించని ట్విస్టులు మాత్రమే కాదు. ఒక కథ ప్రేక్షకుడి మనసులో తెలియని భయాన్ని, ఆసక్తిని కలిగిస్తూ వెంటాడితేనే ఆ అనుభూతి ప్రత్యేకంగా నిలుస్తుంది.
హారర్ సినిమాలు అంటే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే నేపథ్య సంగీతం, ఊహించని ట్విస్టులు మాత్రమే కాదు. ఒక కథ ప్రేక్షకుడి మనసులో తెలియని భయాన్ని, ఆసక్తిని కలిగిస్తూ వెంటాడితేనే ఆ అనుభూతి ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘అగాధ’ (Agadha)కూడా అలాంటి భిన్నమైన అనుభూతిని అందించే సినిమా. దీన్ని కేవలం హారర్ చిత్రంగా చెప్పడం కంటే.. మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలతో ముడిపడిన ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే థ్రిల్లర్ అని చెప్పడం కరెక్ట్ అంటున్నారు మేకర్స్. ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. కామాక్షి భాస్కర్ల, స్రావం రెడ్డి కీలక పాత్రధారులు. ఇందులో శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్రకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులతో పాటు చిత్ర బృందం కూడా ఆయన్ను అభినందిస్తుంది.
'ఈ సినిమాకు కథతో పాటు పాత్రలే ప్రధాన బలం. శ్రవణ్ రెడ్డి (Sravan reddy) పోషించిన పాత్ర సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. సినిమా ప్రారంభంలో సహజంగా, మన చుట్టూ కనిపించే వ్యక్తిలానే అనిపించే అతని పాత్ర.. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఒక్కో కొత్త కోణాన్ని బయటపెడుతుంది. హీరోగా కనిపిస్తూనే మరోవైపు యాంటీ హీరో షేడ్స్‌ను కూడా చూపించే ఈ పాత్రలో ఎన్నో లేయర్స్ దాగి ఉన్నాయి. ఆ పాత్రలోని మార్పులను శ్రవణ్ రెడ్డి తన నటనతో ఎంతో సహజంగా ఆవిష్కరించారు' అని దర్శకుడు చెబుతున్నారు.
'ముఖ్యంగా అతని పెర్ఫార్మెన్స్‌లో అశాంతిని కలిగించే గుణం ప్రేక్షకుడిని మరింత ఆసక్తికి గురిచేస్తుంది. అది కేవలం భయపెట్టే ప్రయత్నం వల్ల వచ్చే ఫీలింగ్ కాదు. ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నామనే భావన ప్రేక్షకుడికి కలగకుండా చేయడంలో అతని నటన కీలకంగా నిలిచింది. పాజిటివ్, నెగటివ్ షేడ్స్ మధ్య ఉండే ఆ క్లిష్టమైన గ్రే షేడ్ ను శ్రవణ్ అద్భుతంగా చేశాడు. కొన్ని సందర్భాల్లో అతను ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నా.. ఆ పాత్రలో ఏదో తెలియని విషయం దాగి ఉందనే అనుమానం ప్రేక్షకుడిని వెంటాడుతుంది. అదే ఈ పాత్రను మరింత ఆసక్తికరంగా మార్చే అంశం. సినిమా ప్రారంభంలో మనకు పరిచయం చేసే శ్రవణ్ పాత్ర.. కథ ముగిసే సమయానికి పూర్తిగా మరో స్థాయికి చేరుకుంటుంది. ఆ పరిణామాన్ని ఎలాంటి అతిశయోక్తి లేకుండా, సంయమనం, ఆత్మ విశ్వాసంతో శ్రవణ్ రెడ్డి తెరపై ఆవిష్కరించాడు. హీరోగా కనిపించే సందర్భాల్లో ఎంత సహజంగా ఉన్నాడో.. యాంటీ హీరో షేడ్స్ బయటపడే సమయంలో అంతే ప్రభావవంతంగా కనిపించాడు' అని చిత్ర బృందం ప్రశంసిస్తోంది.