సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mrunal Thakur: డీప్‌ఫేక్ ఫొటోలు.. మృణాల్ షాక్.. ఎవర్నీ వదలను.. 

ABN, Publish Date - Aug 04 , 2026 | 11:50 AM

పెరుగుతున్న టెక్నాలజీ సెలబ్రిటీల పాలిట శాపంగా మారింది. AI పేరుతో జరుగుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలు స్టార్స్ ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. 

పెరుగుతున్న టెక్నాలజీ సెలబ్రిటీల (AI Technology) పాలిట శాపంగా మారింది. AI పేరుతో జరుగుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలు స్టార్స్ ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ కాగా ఆమె ఘాటుగా హెచ్చరించారు.  తాజాగా  మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)కు అదే పరిస్థితి ఎదురైంది. ఆమెకు సంబందించిన ఫోటోలు  ఇటీవల ఎక్స్ (X)లోని ఓ పేజ్‌లో మార్ఫింగ్ చేసిన డీప్‌ఫేక్ చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. అవి క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నటి వెంటనే స్పందించారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా పేరుతో డీప్‌ఫేక్ ఫొటోలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను అస్సలు సహించను. వెంటనే వాటిని తొలగించండి. లేకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు" అని మృణాల్ హెచ్చరించారు.అంతేకాదు, ఇకపై ఆ ఫొటోలను ఎవరైనా షేర్ చేసినా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది.

గతంలో రష్మిక మందన్న, కాజోల్, ఆలియా భట్ తదితర సెలబ్రిటీలు కూడా డీప్‌ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్నికోరారు. 

Updated Date - Aug 04 , 2026 | 12:36 PM