ఇప్పటివరకు.. ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కథ 'మిరాకిల్'
ABN, Publish Date - Mar 09 , 2026 | 05:30 PM
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం మిరాకిల్.
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం మిరాకిల్. రణధీర్ బీసు, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లు. సీనియర్ హీరోలు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తుండగా. "సత్య గ్యాంగ్, ఫైటర్ శివ" చిత్రాల ఫేమ్ ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన "కొండమడుగు"లో పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్ సభ్యులందరి సమక్షంలో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ద్వారా ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. మిరాకిల్ చిత్రం తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోతుందని తెలిపారు. సీనియర్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. "మిరాకిల్" వంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద హిట్ చేస్తారని, దర్శకుడిగా ప్రభాస్ నిమ్మలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరో రణధీర్, సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్లు నవ్యశ్రీ, అక్షర, విలన్ పాత్రధారి నరేష్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా భావించారన్నారు.. మరీ ముఖ్యంగా శ్రీరామ్, సురేష్, హెబ్బా పటేల్ సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేను. హీరో రణధీర్, విలన్ నరేష్ నాయుడులకు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది. ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతుంది అన్నారు. ఈ గ్రామంలో కచ్చితంగా సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తాం అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. "ఈ మూడో షెడ్యూల్ తో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేస్తాం. మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది" అని అన్నారు.