Meena: మనిషి పుట్టాకే కులం, మతం పుట్టుకొచ్చాయి
ABN, Publish Date - Aug 06 , 2026 | 09:33 AM
సీనియర్ నటి మీనా (Meena) సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
సీనియర్ నటి మీనా (Meena) సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కులం, మతం, లింగం వంటి అంశాల కంటే మనిషి వ్యక్తిత్వం, గుణగణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె చేసిన వ్యాఖ్యలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.వివాహం అనంతరం సినిమాలకు కొంత దూరంగా ఉన్న మీనా, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో తరచూ మమేకమవుతున్నారు. ముఖ్యంగా తన భర్త మరణం తర్వాత జీవితానికి సంబంధించిన విలువలు, సామాజిక అంశాలపై అప్పుడప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. "మీ కులం, మతం, జన్మస్థలం, లింగం వంటి గుర్తింపులు మీరు పుట్టిన తర్వాత వచ్చినవే. వాటి కోసం మీరు ఎలాంటి కృషి చేయలేదు. కాబట్టి వాటిని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు" అని ఆమె పేర్కొన్నారు.'మనిషి నిజమైన గుర్తింపు అతని గుణగణాలు, చేసే పనులు, ఇతరుల పట్ల చూపే మానవత్వం. వాటి గురించే గర్వపడాలి. ప్రతి రోజూ మంచి మనిషిగా జీవించడానికి ప్రయత్నించాలి" అని మీనా తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.