సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫేస్బుక్ ప్రియుడితో.. కుంభమేళా మోనాలిసా పెళ్లి!

ABN, Publish Date - Mar 11 , 2026 | 09:23 PM

ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించి మరోసారి వార్తల్లోకి నిలిచింది కుంభమేళా మోనాలిసా .

monalisa

గ‌తేడాది ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పూస‌లు అమ్ముతూ కెమెరా క‌న్నుకు చిక్కి ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా ఎదిగింది మోనాలిసా (Monalisa) అనే సాధార‌ణ గ్రామీణ యువ‌తి. ఆపై వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, సీరియ‌ల్స్‌, సినిమాలు అంటూ క్ష‌ణం తీరిక లేకుండా బిజీ తార‌గా ఎదిగింది. తెలుగులోనూ లైఫ్ అనే సినిమాలోనూ న‌టిస్తోంది. అలాంటిది.. ఈ అమ్మ‌డు తాజాగా తన ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించి మరోసారి వార్తల్లోకి నిలిచింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఫేస్‍బుక్‍లో పరిచయమైన మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన ఫర్మాన్ ఖాన్ (Farman) అనే యువకుడితో మోనాలిసా గ‌తేడాదిగా ప్రేమాయ‌ణం సాగిస్తోంది. అయితే వీరి ప్రేమ‌ను మోనాలిసా పేరెంట్స్ ఒప్పుకోక‌పోవ‌డంతో తిరువనంతపురం తంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

త‌న తండ్రి విజ‌య్ సింగ్ ఆయ‌న‌కు న‌చ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి చేస్తున్నాడ‌ని ఫిర్యాదు చేసింది. మా జంట‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరింది. ఆ వెంట‌నే ప‌లువురు స్థానిక‌ పెద్ద మ‌నుషుల స‌మ‌క్షంలో హ‌ఙందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఈ జంట వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Mar 11 , 2026 | 09:49 PM