సినిమా విడుదలకు ముందే దర్శకుడికి కాస్ట్‌లీ గిఫ్ట్.. ట్రెండ్ మారింది
ABN, Publish Date - Jun 18 , 2026 | 01:36 PM
ఈ మధ్యకాలంలో సినిమా విడుదలై మంచి సక్సెస్ అయిన తర్వాత, ఆ సినిమాకు పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూకి నిర్మాతలు గిఫ్ట్‌గా కారును ఇవ్వడం అనే ట్రెండ్‌ని బ్రేక్ చేశారు ఇప్పుడో నిర్మాత.
ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్‌ని బ్రేక్ చేశారు ‘కొరగజ్జ’ (Koragajja) నిర్మాత. ఈ మధ్యకాలంలో సినిమా విడుదలై మంచి సక్సెస్ అయిన తర్వాత, ఆ సినిమాకు పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూకి నిర్మాతలు గిఫ్ట్‌గా కారును ఇవ్వడం అంతా చూస్తూనే ఉన్నారు. అలాగే.. తమకు సక్సెస్ ఇచ్చిన దర్శకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు హీరోలు కారును గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా జరుగుతూ వస్తోంది. చిరంజీవి, సూర్య వంటి స్టార్ హీరోలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఇదంతా సినిమా విడుదలై సక్సెస్ అయిన తర్వాత మాత్రమే. కానీ, ‘కొరగజ్జ’ నిర్మాత సినిమా విడుదల కాకుండానే చిత్ర దర్శకుడికి కాస్ట్‌లీ గిప్ట్ ఇచ్చి వార్తలలో హైలెట్ అవుతున్నారు. ఆ వివరాలలోకి వెళితే..
సుధీర్ అత్తవర్ (Sudhir Attavar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కొరగజ్జ’. ఈ సినిమా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సమయంలో.. ఈ చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్నట్లు ప్రకటించి, విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతం కొచ్చి, చెన్నైలో త్రీడీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని... సాంకేతికంగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయికి దీటుగా రూపుదిద్దుకుంటోందని దర్శకుడు సుధీర్ అత్తవర్ తెలిపారు. అంతర్జాతీయ పంపిణీ సంస్థల నుంచి ఈ సినిమాకు పెరుగుతున్న డిమాండ్, ఆసక్తిని చూసి నిర్మాత త్రివిక్రమ సాపల్య (Trivikram Sapalya).. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం గత మూడేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోన్న దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు శోభా డెవలపర్స్ వారిచే నిర్మించబడిన సుమారు రూ. 1.75 కోట్ల మార్కెట్ విలువ గల లగ్జరీ త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చి సరికొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత త్రివిక్రమ సాపల్య మాట్లాడుతూ.. ‘కొరగజ్జ’ చిత్రాన్ని చైనీస్ వంటి విదేశాల్లో విడుదల చేయడానికి హాంకాంగ్, బీజింగ్, ఇతర ప్రాంతాల నుంచి అంతర్జాతీయ పంపిణీ సంస్థలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. సినిమా బడ్జెట్ రూ. 40 కోట్లు దాటింది. అయినప్పటికీ ఈ సినిమాపై మాకు నమ్మకం పెరుగుతూనే ఉంది. దీనికి గుర్తుగానే గత మూడేళ్లుగా ఈ సినిమాపై పనిచేసిన దర్శకుడికి ఈ ఫ్లాట్‌ను బహుమతిగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎగ్జిక్యూటివ్ నిర్మాత, ఎడిటర్ విద్యాధర్ శెట్టి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!
వెంకటేష్, విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. ఆ లీగ్ జరుగుతుందా?
వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే