Jigris OTT: ఓటీటీలో. . కృష్ణ బురుగుల ‘జిగ్రిస్’ ప్రభంజనం!
ABN, Publish Date - Jan 15 , 2026 | 06:57 PM
సందీప్ రెడ్డి వంగా సపోర్ట్‌తో ఇటివల వచ్చిన జిగ్రీస్ సినిమా ఓటీటీల్లో దూసుకెళుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ‘జిగ్రిస్’ నామస్మరణే వినిపిస్తోంది. ఒక చిన్న సినిమాగా వచ్చి, సైలెంట్‌గా ఓటీటీలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ అంతా హీరో కృష్ణ బురుగుల ఖాతాలోకి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు వచ్చే రేంజ్ రెస్పాన్స్ ఇప్పుడు కృష్ణ నటనకు వస్తుండటం విశేషం. సినిమాలో కార్తీక్ అనే పాత్రలో కృష్ణ పరకాయ ప్రవేశం చేశాడని చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూ సీన్, గుండెల్ని పిండేసే క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన పలికించిన హావభావాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ‘బ్రో.. నీ యాక్టింగ్ చూశాక నీకు ఫ్యాన్ అయిపోయాం’ అంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ చూస్తుంటే, కృష్ణ ఆడియన్స్ మనసుల్లో ఎంతలా పాతుకుపోయారో అర్థమవుతోంది.
అయితే.. ఒకప్పుడు ‘కలర్ ఫోటో’ సినిమా ఓటీటీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో, ఇప్పుడు ‘జిగ్రిస్’ మూవీతో కృష్ణ బురుగుల అదే స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. సినీ విమర్శకులు సైతం ఈ యంగ్ నటుడి ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు. సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలో ఉన్నా, ఇంటి దగ్గర కూర్చుని ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారంటే అది కేవలం కృష్ణ నటన, మౌత్ పబ్లిసిటీ వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. మొత్తానికి, తన సహజ సిద్ధమైన నటనతో కృష్ణ బురుగుల ఇప్పుడు ఒక అన్-స్టాపబుల్ ఓటీటీ స్టార్‌గా అవతరించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ హీరో దొరికాడని ఇక అంతా ఫిక్సయిపోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో టాప్ 1లో దూసుకెళుతోంది.