Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఇక గంటన్నర వీడియోలు!
ABN, Publish Date - Oct 28 , 2026 | 09:38 AM
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా రూల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన భాగం అయిపోయింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా (Social Media) రూల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన భాగం అయిపోయింది. ఒక సెకను సమయం దొరికినా చాలు ప్రతి ఒక్కరి చేయి మొదటగా ఇన్ స్టా రీల్స్ వైపే వెళుతున్నాయి. అంతగా ప్రజలతో ఇన్ స్టా మమేకమయింది. అంతేకాదు చాలామందికి ఇదొక ప్రధాన జీవనాధారంగా కూడా మారింది. దీనిని ఉపయోగించి వందల నుంచి కోట్లలో డబ్బులు సంపాదించే వారు కూడా ఇప్పుడు అధికమయ్యారు. అయితే.. తాజాగా ఇన్‌స్టా తేబోతున్న కొత్త అప్‌డేట్‌పై అందరి దృష్టి పడింది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రధా నంగా రీల్స్ వంటి చిన్న వీడియోలకే ప్రాధాన్యమిచ్చిన సంస్థ.. ఇకపై 90 నిమిషాల (Instagram 90 Minute Videos) నిడివి గల వీడియోలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం 'ఫీచర్స్' పేరుతో కొత్త ఫార్మాట్‌ను పరీక్షిస్తోంది. అంటే చిన్న పాటి సినిమాలు, షార్ట్ ఫిలింస్ కూడా అప్‌లోడ్ చేయవచ్చు, వాటిని వీక్షించవచ్చు కూడా.
ఈ ఫార్మాట్‌లో క్రియేటర్లు 90 నిమిషాల వరకు నిడివి గల హారిజాంటల్ (అడ్డంగా ఉండే) వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. ఈ సరికొత్త అప్డేట్‌లో భాగంగా చిన్న రీల్స్‌ను పూర్తి నిడివి గల వీడియోలకు అనుసంధానించవచ్చు. ఉదాహరణకు..ఒక పాడ్కాస్ట్‌కు సంబంధించిన చిన్న రీల్ (Reels) ను చూసిన వినియోగదారులు దానిపై క్లిక్ చేసి పూర్తి ఎపి సోడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనే వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బ్రెజిల్, అమెరికాలోని కొంతమంది పరిమిత క్రియేటర్లతో మాత్రమే టెస్ట్ చేస్తున్నట్లు ఇన్‌స్టా ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నారు.