సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న..ఇండిపెండెంట్ ఫిల్మ్‌ 'భాగ్యనగరంలో సారథి ప్రేమ'

ABN, Publish Date - Jul 16 , 2026 | 04:25 PM

యువ దర్శకుడు రంగుభుక్త రాము తెరకెక్కించిన 'భాగ్యనగరంలో సారథి ప్రేమ' ప్రస్తుతం యూట్యూబ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Bhagyanagaramloo Saradhi Prema

స్టార్ హీరోలు, భారీ బడ్జెట్‌లు లేకపోయినా.. మంచి కథ, అంకితభావం ఉంటే ప్రేక్షకులను మెప్పించే సినిమా రూపొందించవచ్చని చాటిచెప్పింది ఇండిపెండెంట్ ఫిల్మ్‌ 'భాగ్యనగరంలో సారథి ప్రేమ'. యువ దర్శకుడు రంగుభుక్త రాము తొలి ప్రయత్నంగానే ఈ చిత్రాన్ని బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూనే దాదాపు ఏడాదిన్నర పాటు కష్టపడి తన కలను తెరపై ఆవిష్కరించడం విశేషం. కొత్త నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, వాల్దాస్ భరత్ గౌడ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్రిన్స్ వంశీ, నిక్కీ చారి జంటగా నటించగా, ఐవీడీ సాయి ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. నితిన్, చోటు, వినయ్, రాజా, హరి తదితరులు కథకు కీలకంగా నిలిచే పాత్రలను పోషించారు. పాత్రల ఎంపిక నుంచి నటన వరకు సహజత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంతో సినిమా మరింత దగ్గరగా అనిపిస్తుంది.

రామయ్య చెంబోలు కథ అందించగా, శ్రావణ్ కుప్పిలి సంభాషణలతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. సంగీత దర్శకుడు సంపత్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం భావోద్వేగాలను మరింత బలపరుస్తాయి. పవన్ కొంబత్తుల సాహిత్యం కూడా సందర్భానికి తగ్గట్టుగా ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ కోమటి సినిమాటోగ్రఫీ, భాను డీవోపీ బృందంలో చేసిన కృషి, గీవన్ జీఆర్ ఎడిటింగ్ కలిసి చిత్రానికి మంచి విజువల్ క్వాలిటీని అందించాయి. హైదరాబాద్‌లో పరిమిత వనరులతో షూటింగ్ నిర్వహించిన ఈ చిత్రాన్ని కేవలం 10 రోజుల్లో పూర్తి చేయడం విశేషం. మొత్తం 1 గంట 10 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమాను ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించగా, అక్కడి నుంచి సానుకూల స్పందన లభించింది. అనంతరం ప్రముఖ నటుడు ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'భాగ్యనగరంలో సారథి ప్రేమ' యువత భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం, జీవితంలో ఎదురయ్యే పోరాటాలను హృదయానికి హత్తుకునేలా చూపిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, వాల్దాస్ భరత్ గౌడ్ మాట్లాడుతూ.. కొత్త దర్శకులు, కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో మరిన్ని వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

Updated Date - Jul 16 , 2026 | 05:15 PM