సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మాధురి రాథోడ్.. మ‌ళ్లీ దుమ్ము దులిపేసిందిగా

ABN, Publish Date - Oct 19 , 2026 | 07:26 PM

ఇటీవ‌ల వ‌రుస వివాదాల‌తో టాక్ ఆఫ్ ది మీడియాగా నిలిచిన ప్ర‌ముఖ ఫోక్ డ్యాన్స‌ర్ మాధురి రాథోడ్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది.

MADHURI RATHOD

ఇటీవ‌ల వ‌రుస వివాదాల‌తో టాక్ ఆఫ్ ది మీడియాగా నిలిచిన ప్ర‌ముఖ ఫోక్ డ్యాన్స‌ర్ మాధురి రాథోడ్ (MADHURI RATHOD) మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. అయితే ఈ సారి వైర‌ల్ న్యూస్‌తో కాదు. తాను నూత‌నంగా న‌ర్తించిన జాన‌ప‌ద గీతం భామ సుంద‌రాలో (BHAMA SUNDARALO) తాజాగా యూ ట్యూబ్‌లో విడుద‌లై విజ‌య‌వంతంగా దూసుకెళుతుంది. అయితే ఈ పాట‌లో త‌రుచూ క‌నిపించే త‌న ప్రియిడు సాయితో కాకుండా వెంక‌ట్ అజ్మీరా (VENKAT AJMEERA) తో క‌లిసి ఆడి పాడింది.

ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌ష్క‌రించుకుని సోమ‌వారం రిలీజ్ అయిన ఈ పాట కొద్ది స‌మ‌యంలోనే మిలియ‌న్‌కు పైగా వ్యూస్ రాబ‌ట్టి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. దివంగ‌త రామ‌స్వామి (RAMASWAMY ) సాహిత్యం అందించిన ఈ గేయానికి న‌టుడు వెంక‌ట్ అజ్మీరానే స్వ‌యంగా సంగీతం అందించ‌గా శేఖ‌ర్ వైర‌స్ (SHEKAR VIRUS) నృత్య‌రీతులు స‌మ‌కూర్చాడు. న‌ర‌సింహులు (NARSIMULU), ముకుంద (MUKUNDA) ఆల‌పించారు. పాట‌లోని సాహిత్యానికి తోడు మాధురి డ్యాన్స్ ఈ పాట‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ఈ పాట‌పై ఓ లుక్ వేయండి.

Updated Date - Oct 19 , 2026 | 07:26 PM