సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విస్తరిస్తున్న హోంబలే వ్యాపార సామ్రాజ్యం

ABN, Publish Date - Feb 27 , 2026 | 05:53 PM

హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. భారతీయ సినిమా హద్దులు చెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది.

Hombale Films

ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) ఇప్పుడు తన పరిధిని విస్తరించబోతోంది. 2012లో విజయ్‌ కిరగందూర్ హోంబలే ఫిలిమ్స్ ను స్థాపించారు. ఆయన బ్యానర్ నుండి తొలి చిత్రంగా పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 'నిన్నిందాలే' వచ్చింది. ఆ తర్వాత యశ్ నటించిన సినిమాలను ఆ సంస్థ నిర్మించింది. ఈ బ్యానర్ నుండి వచ్చిన 'కేజీఎఫ్‌' (KGF) తో అంతర్జాతీయంగా ఈ సంస్థకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత వచ్చిన 'కేజీఎఫ్‌ 2, కాంతార (Kanthara), సలార్ (Salaar)' చిత్రాలు మంచి విజయం సాధించాయి. అలానే ఈ సంస్థ నుండి వచ్చిన తాజా చిత్రం 'కాంతార: చాప్టర్ 1' కూడా ఘన విజయం సాధించింది. అలానే ఈ సంస్థ భాగస్వామ్యంలోనే 'మహావతార్ నరసింహా' వచ్చి కలెక్షన్స్ సునామీ సృష్టించింది.


తాజాగా హోంబలే సంస్థ అంతర్జాతీయ పంపిణీరంగంలోకి అడుగు పెడుతున్నట్టు తెలిపింది. భారతీయ సినిమా హద్దులు చెరిగిపోయిన సందర్భంలో తాము కూడా ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ లోకి ఎంటర్ అవుతున్నట్టు పేర్కొంది. అయితే... ఏ సినిమా హక్కులను అంతర్జాతీయ స్థాయిలో వారు పంపిణీ చేయబోతోంది తెలియచేయలేదు.

Updated Date - Feb 27 , 2026 | 05:55 PM