సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మ‌ద్యం మ‌త్తులో రాజ్ త‌రుణ్ ల‌వ‌ర్ ర‌చ్చ ర‌చ్చ‌! యాక్సిడెంట్.. ఆపై వాగ్వాదం

ABN, Publish Date - Mar 26 , 2026 | 09:51 PM

ప్ర‌ముఖ సినీ న‌టుడు రాజ్ త‌రుణ్ ( Raj Tarun) మాజీ ప్రేయ‌సి లావ‌ణ్య (Lavanya) మ‌రోమారు వార్త‌ల్లో నిలిచింది.

lavanya

ప్ర‌ముఖ సినీ న‌టుడు రాజ్ త‌రుణ్ ( Raj Tarun) మాజీ ప్రేయ‌సి లావ‌ణ్య (Lavanya) మ‌రోమారు వార్త‌ల్లో నిలిచింది. అయితే.. ఈ మారు రాజ్ త‌రుణ్‌పై ఫిర్యాదు విష‌యంలో మాత్రం కాదు. తాజాగా మ‌ద్యం మ‌త్తులో నానా హంగామా చేసింది. అంతేగాక గ్రామ‌స్థులు, పోలీసుల‌తో వాగ్వాదానికి దిగి ర‌చ్చ చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. కారులో ప్ర‌యాణిస్తున్న లావ‌ణ్య‌ సంగారెడ్డి జిల్లా మ‌ల్లేప‌ల్లి ప‌రిస‌రాల్లో ఓ ద్విచ‌క్ర వాహనాన్ని ఢీ కొట్టి అక్క‌డి నుంచి వేగంగా వెళ్ళిపోయే ప్ర‌య‌త్నం చేయ‌గా గ్రామ‌స్థులు అడ్డుకున్నారు.

ఆ స‌మ‌యంలో స్థానికులతో గొడ‌వ జ‌ర‌గ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం అందించగా ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న వారు లావ‌ణ్య‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వ‌హించ‌గా పాజిటివ్‌గా తేలింది. అంతేగాక ఆమె వెంట మ‌రో వ్య‌క్తి సైతం ఉన్న‌ట్లు తెలిసింది. అలాగే కారులో మ‌ద్యం బాటిళ్లు కూడా ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు ప్రమాద ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Updated Date - Mar 27 , 2026 | 08:15 PM