సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎఫ్.ఎన్.సి.సి. ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్‌ లీగ్‌!

ABN, Publish Date - Apr 03 , 2026 | 06:58 PM

ఈ నెల 4వ తేదీ నుండి ఎఫ్.ఎన్.సి.సి., పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఎఫ్‌.ఎన్.సి.సి. అధ్యక్షులు కె.ఎన్. రామారావు తెలిపారు.

FNCC

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం శుక్రవారం ఎఫ్ఎన్ సిసిలో సందడిగా జరిగింది. ఈ నెల 4, 5 తేదీలలో ప్రారంభమయ్యే ఈ లీగ్ వచ్చే నాలుగైదు వీకెండ్స్‌లో శని, ఆదివారాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 10 మెన్ అండ్ వుమెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌ ఈ లీగ్‌లో పాల్గొనబోతున్నారు.

ఈ సందర్భంగా ఎఫ్.ఎన్.సి.సి. అధ్యక్షులు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, 'తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్, ఎఫ్.ఎన్.సి.సి. బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం గార్ల చొరవతో ఎఫ్.ఎన్.సి.సి. - పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభిస్తున్నాం. క్రికెట్‌తో పాటు బ్యాడ్మింటన్ లాంటి ఇతర క్రీడలను ప్రోత్సహించాలి, యువతను అన్ని స్పోర్ట్స్ వైపు తీసుకెళ్లాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈ లీగ్ నిర్వహిస్తున్నాం. మా ఎఫ్ఎన్ సిసి నుంచి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ.. ఇలా టీమ్స్ ఉంటాయి. ఇక నుంచి ప్రతి ఏటా టెన్నిస్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ వంటి పోటీలు నిర్వహించబోతున్నాం' అని అన్నారు.

బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం మాట్లాడుతూ, 'ఈ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. గోపీచంద్ గారు రేపు జరిగే కార్యక్రమానికి వస్తారు. మా దగ్గర టోర్నమెంట్ పెట్టి మొదలు పెట్టి నాలుగైదేళ్లవుతోంది. అందుకే మా సభ్యుల సూచన మేరకు మొదట క్లబ్ టోర్నమెంట్, ఆ తర్వాత ఇంటర్ క్లబ్ టోర్నమెంట్, ఆ తర్వాత నేషనల్స్ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నాం' అని అన్నారు.


తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ మాట్లాడుతూ, 'సోర్ట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఎఫ్.ఎన్.సి.సి. కార్యవర్గం ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఇక్కడే టెన్నిస్ నేషనల్స్, బ్యాడ్మింటన్ నేషనల్స్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాం. ఇప్పుడు పుల్లెల గోపీచంద్, ఎఫ్ఎన్ సీసీ లీగ్ ప్రారంభిస్తున్నాం. మేనేజ్ మెంట్ తరపున ప్రెసిడెంట్, సెక్రటరీ టీమ్స్ ఉంటాయి. పురుషోత్తంగారితో పాటు ఎవరైనా టీమ్స్ పాల్గొంటే 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి. అవి ఈ టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్ మనీ ఇచ్చేందుకు ఉపయోగిస్తాం' అని చెప్పారు.


ఫిలింనగర్ సొసైటీ సెక్రటరీ, ఎఫ్.ఎన్.సి.సి. కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ, 'ఇది ఒక క్లబ్ మాత్రమే కాదు ఇక్కడ ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ చేస్తామని మా ప్రెసిడెంట్ కేఎస్ రామారావు గారు నిరూపించారు. ఏ క్లబ్‌కు లేనంత మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మన దగ్గర ఉంది. చాముండేశ్వరీనాథ్ గారు వచ్చాక మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూపురేఖలు మారిపోయాయి. దేశవ్యాప్తంగా వివిధ క్రీడల్లో పేరున్న ఎంతోమందిని ఆయన మన దగ్గరకు తీసకొచ్చారు. ఈ టోర్నమెంట్ కూడా బాగా జరగాలి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఎన్.సి.సి. సెక్రటరీ తుమ్మల రంగారావు, సభ్యులు సోమరాజు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఎన్ రెడ్డి, ట్రెజరర్ శైలజ జూజాల, కమిటీ మెంబర్స్ వేణు, ఏడిద రాజా, కమిటీ మెంబర్ - స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ కోగంటి భవానీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 06:58 PM