సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్యపై అవాకులు - చెవాకులు... ఆగ్రహించిన ఫ్యాన్స్

ABN, Publish Date - Mar 27 , 2026 | 11:34 AM

బాలకృష్ణపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై అభిమానులు పోలీస్‌ కేసు పెట్టారు. వెంటనే సదరు వ్యక్తి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని వారు పోలీసు అధికారులను కోరారు.

Nandamuri Balakrishna

హిందూపురం శాసనసభ్యులు, పద్మభూషణ్ గ్రహీత, బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పై సొహైల్ అహ్మద్ అనే వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ లో అనుచిత, నిరాధార ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడాన్ని బాలకృష్ణ అభిమానులు తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. ప్రకాశం జిల్లా ఎన్.బి.కె. ఫ్యాన్స్ తరపున ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం తాగి వస్తారనే పద్థతిలో అవమానకరంగా మాట్లాడడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. గౌరవ శాసనసభను అగౌరవ పరిచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వారు అన్నారు.


సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ గౌరవానికి భంగం కలిగించేలా అభిమానుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడంపై వారు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ విజయ కృష్ణకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే సోహెల్ అహ్మద్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అతని ఇంస్టాగ్రామ్‌ ఖాతాను, అతని పేరున గల ఇతర సామాజిక మాధ్యమాల అకౌంట్స్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు సి.ఐ.ను కోరారు. ప్రకాశం జిల్లా ఎన్ బి కె ఫ్యాన్స్ అధ్యక్షుడు రావి వాసు, ఒంగోలు నగర ఎన్ బి కె ఫ్యాన్స్ అధ్యక్షుడు కాట్రగడ్డ వంశీ ఈ ఫిర్యాదు చేశారు. వారి వెంట ఎన్ బి కె ఫ్యాన్స్ హనీఫ్ ఖాన్, కొమ్మాలపాటి మనోజ్, బెల్లం రామకృష్ణ, యమల బాల కృష్ణ, బెజవాడ మురళీకృష్ణ తదితరులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళారు.

Updated Date - Mar 27 , 2026 | 11:34 AM