'ఫ్రీ మూవీ యాప్' పేరుతో.. రూ.1.75 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
ABN, Publish Date - May 06 , 2026 | 09:23 AM
ఫేస్‌బుక్‌లో కనిపించిన ఫ్రీ మూవీ యాప్ ప్రకటనను నమ్మి డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తి రూ.1.75 లక్షలు కోల్పోయాడు.
ఓ వ్యక్తి ఫేస్బుక్‌లో కనిపించిన ఉచిత సినిమా యాప్ ప్రకటనను నమ్మి డౌన్లోడ్ చేసుకోవడంతో రూ.1.75 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ టీ సాయి మనో హర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు తన ఫోన్లో ఫేస్బుక్ చూస్తుండగా 'లేటెస్ట్ మూవీస్ ఫ్రీగా చూడండి ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి' అనే ప్రకటన కనిపించింది.
ఆసక్తితో అందులోని లింక్‌పై క్లిక్ చేయగా, అది 'జీడీసీఆర్ ట్యూబీ,టీవీ' అనే వెబ్సైట్‌కు తీసు కెళ్లింది. అక్కడి నుంచి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. యాప్‌లో సినిమా కూడా చూశాడు. కొద్దిసేపటి తర్వాత మొబైల్, యూపీఐ, ఇతర యాప్స్ సరిగా పనిచేయలేదు.
దీంతో అనుమానం వచ్చిన అతను వెంటనే తన బ్యాంక్ యాప్స్‌ను పరిశీలించగా, ఖాతా నుంచి 80వేలు డెబిట్ అయి నట్లు గుర్తించాడు. అదే మొబైల్‌తో నిర్వహిస్తున్న తన తల్లి బ్యాంక్ ఖాతాను పరిశీలించగా.. అందులో నుంచి కూడా 35వేలు మాయమైనట్లు తెలిసింది.