సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నిర్మాత చదలవాడ టింబర్ డిపోలో అద్భుతం!

ABN, Publish Date - Mar 04 , 2026 | 07:06 PM

చదలవాడ బ్రదర్స్‌కు చెందిన ఏషియన్ టింబర్ టిపోలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. కలపను కోయగా శ్రీవారి పాదాలు దర్శనమిచ్చాయని చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. ఈ చరణాలకు ఇకపై నిత్యం పూజలు చేస్తామని అన్నారు.

Chadalawada Srinivasarao

ప్రముఖ నిర్మాత, కలప వ్యాపారి చదలవాడ తిరుపతిరావు (Chadalawada Srinivasarao), శ్రీనివాసరావు (Srinivasarao) సోదరుల గురించి చిత్రసీమలో అందరికీ తెలిసిందే. ఇటీవల అయోధ్యలో నిర్మితమైన రామ్ లలా ఆలయంలో ద్వారాలను, తలుపులను వీరి టింబర్ డిపోలోనే తయారు చేసి ట్రస్ట్‌కు అందచేశారు. అలానే చెన్నయ్‌లో మహానటుడు నందమూరి తారక రామారావు (Nandamuri Tharaka Ramarao) నివసించిన ఇంటిని చదలవాడ సోదరులు కొనుగోలు చేసి దాన్ని ఓ మ్యూజియంగా మార్చుతున్నారు. దాన్ని త్వరలోనే ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచబోతున్నారు.


ఇదిలా ఉంటే... గడచిన శనివారం చదలవాడ బ్రదర్స్‌కు చెందిన ఏషియన్‌ టింబర్ డిపోలో ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. రోజువారి కార్యకలాపాల్లో భాగంగా కార్మికులు కలప దుంగను కోతకు సిద్ధం చేశారు. దానిని కోత మిషన్ ఎక్కించి మధ్యకు కట్ చేయగానే.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ చెక్కల పైన మనిషి పాదాలను పోలిన ఆకృతి కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని తమ యజమాని చదలవాడ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్ళగా హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఆయన.. దుంగపై ఉన్న పాదాల ఆకృతిని పరిశీలించి, అవి తమ ఇలవేల్పు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుని చరణాలేనని భావించిన సాష్టాంగ నమస్కారం చేశారు. 'ఆ వెంకటేశ్వరుడే తమ చరణాలతో మా ఇంటిని పవిత్రం చేశాడు. ఇది మా పూర్వజన్మ సుకృతం. ఈ చరణాలను ఇక్కడే ఉంచి నిత్యం పూజలతో ఆరాధిస్తాం' అని తెలిపారు.


విశేషం ఏమంటే చదలవాడ సోదరులు ముగ్గురివి తిరుమల వాసుని పేర్లే. ఒకరి పేరు వేంకటేశ్వరరావు కాగా మరో ఇద్దరి పేర్లు తిరుపతిరావు, శ్రీనివాసరావు. ఇందులో శ్రీనివాసరావు సతీమణి పేరు పద్మావతి. తెనాలికి చెందిన ఈ సోదరులు యుక్త వయసులో తిరుమలకు యాత్రికులను బస్సులలో తీసుకెళ్ళేవారు. శ్రీవారి దర్శనం తర్వాత చెన్నయ్‌లోని ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్ళి, ఆయన్ని కూడా చూపించి తిరుగు ప్రయాణ మయ్యేవారు. అలా తిరుమల తిరుపతి వేంకటేశ్వరునితో ఉన్న చిరకాల అనుబంధం కారణంగా ఇవాళ శ్రీవారి చరణాల సాక్షాత్కారం ఈ రూపంలో జరిగిందని వారి సన్నిహితులు చెబుతున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 07:06 PM