సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డిస్ట్రిబ్యూటర్‌, ప్రొడ్యూసర్‌ బి. హరి హఠాన్మరణం

ABN, Publish Date - May 24 , 2026 | 09:13 AM

నెల్లూరుకు చెందిన ప్రముఖ పంపిణీదారుడు, డబ్బింగ్‌ చిత్రాల నిర్మాత బి. హరి హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు.

Distributor B Hari

తెలుగు సినిమా రంగంలో విషాదం చోటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన ప్రముఖ పంపిణీ దారుడు, డబ్బింగ్‌ చిత్రాల నిర్మాత బి. హరి ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రేష్ఠ మూవీస్‌కు చెందిన పలు చిత్రాలను నెల్లూరులో పంపిణీ చేశారు.

విశాల్‌ తమిళంలో నిర్మించిన పలు చిత్రాలను తెలుగులో 'హరి వెంకటేశ్వర పిక్చర్స్' పతాకంపై హరి విడుదల చేశారు. ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించడంలో ఆయన ముందుండేవారు. హరి విడుదల చేసిన విశాల్‌ 'అభిమాన్యుడు' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు సినిమాలను చెన్నయ్ లో హైర్‌ కు ప్రదర్శిస్తూ, పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన హరి, 2006లో వైవియస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో రామ్ హీరోగా నిర్మించిన 'దేవదాస్‌' చిత్రాన్ని తొలిసారి తమిళనాడులో విడుదల చేశారు. అప్పటి నుంచి గడిచిన ఇరవై యేళ్ళలో వందల చిత్రాలను ఆయన పంపిణీ చేశారు. కుటుంబంతో హైదరాబాద్‌ వచ్చిన ఆయన ఇక్కడ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, బాబు ఉన్నారు. హరి పార్దీవ దేహాన్ని నెల్లూరు తరలించి, అక్కడే అంత్యక్రియలు జరుపబోతున్నట్టు సన్నిహితులు తెలిపారు.

Updated Date - May 24 , 2026 | 09:15 AM