‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్‌లో!

ABN , Publish Date - Jun 03 , 2026 | 09:46 AM

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్‌ పండు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Accident to Pandu Master

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ (Dhee) ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్‌ (Pandu Master) పండు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం జాతీయ రహదారి సమీపంలో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. పండు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో, ఈ ఘటనలో ఆయన కాళ్లకు అత్యంత తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్ర రక్తస్రావమైన పండు మాస్టర్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


మరోవైపు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది? అతి వేగమా లేక మరేదైనా వాహనం ఢీకొట్టిందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్యాన్స్ షోలతో పాటు రీసెంట్‌గా వెండితెరపై కూడా మెరుస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్న పండు మాస్టర్‌కు ఇలాంటి ప్రమాదం జరిగిందని తెలియడంతో సినీ పరిశ్రమతో పాటు బుల్లితెర వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు, తోటి కొరియోగ్రాఫర్లు పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

Buchibabu Sana: పెద్ది.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ కాదు

Updated Date - Jun 03 , 2026 | 09:46 AM