Ali: అలీ చేతుల మీదుగా సిరిమల్లె షోరూంలో లక్కీ డ్రా
ABN, Publish Date - Jan 27 , 2026 | 06:54 PM
ప్రముఖ కథానాయిక సమంత ఇటీవల జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రారంభించిన సిరిమల్లె శారీ షోరూంకి విశేషమైన స్పందన వస్తుంది.
ప్రముఖ కథానాయిక సమంత (Samantha) ఇటీవల జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రారంభించిన సిరిమల్లె శారీ షోరూంకి విశేషమైన స్పందన వస్తుంది. పట్టు, ఫ్యాన్సి శారీలలో అద్భుతమైన వెరైటీ కలెక్షన్‌లతో ఆడవాళ్లకు అభిమాన వస్త్రాలయంగా నిలిచింది. స్టోర్ ప్రారంభించి నెల కావస్తున్న సందర్భంగా లక్కీ డ్రా తీశారు. ఎంతగానో ఆదరించిన కస్టమర్లను సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని బహుమతులకు ఎంపిక చేశారు.
మొదటి బహుమతిగా ఎంజీ కామెట్ కారు, ద్వితీయ బహుమతి వజ్రాల హారం, తృతీయ బహుమతిగా మూడు డబుల్ డోర్ రీఫ్రిజియేటర్‌లను ప్రకటించారు.
సోమవారం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి అనుహ్య స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటుడు అలీ (Ali) ముఖ్యఅతిథిగా పాల్గొని షోరూం యజమానులు సౌజన్య బొబ్బిలి, చంద్ర మోహన్ తిక్క, వాకాడ ఆంజన్ కుమార్, శ్రీనివాస రావు తక్కళ్లపల్లి లతో కలిసి విజేతలకు బహుమతులు ప్రకటించారు.