సినిమా క్రియేటర్స్ కోసం ‘CCO’.. ప్రారంభించిన కేంద్ర మంత్రి
ABN, Publish Date - Jun 29 , 2026 | 04:52 PM
హైదరాబాద్‌లోని NI-MSME ప్రాంగణంలో ఘనంగా జరిగిన ‘CINICATHON 2026’ వేదికగా.. కేంద్ర బొగ్గు అండ్ గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ‘సినీ క్రియేటర్స్ ఆర్గనైజేషన్’ను అధికారికంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని NI-MSME ప్రాంగణంలో ఘనంగా జరిగిన ‘CINICATHON 2026’ వేదికగా.. కేంద్ర బొగ్గు అండ్ గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ‘సినీ క్రియేటర్స్ ఆర్గనైజేషన్ (Cine Creators Organisation - CCO)’ను అధికారికంగా ప్రారంభించారు. భారతీయ ఫిల్మ్, మీడియా, క్రియేటివ్ పరిశ్రమలకు చెందిన ప్రతిభావంతులను ఒకే జాతీయ వేదికపైకి తీసుకువచ్చి, క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేసే దిశగా ఈ సంస్థను ఒక చారిత్రాత్మక ముందడుగుగా మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు.
ఈ ‘CCO’ ద్వారా సినీ రంగానికి చెందిన డైరెక్షన్, రైటింగ్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ ప్రొడక్షన్ వంటి తొమ్మిది ప్రధాన క్రాఫ్ట్స్ నిపుణులందరూ ఒకే తాటిపైకి రానున్నారు. పరస్పర సహకారం, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్, స్కిల్ డెవలప్‌మెంట్, క్రియేటర్స్ సంక్షేమంతో పాటు ఒరిజినల్ మేధో సంపత్తి (IP) సృష్టి, పరిరక్షణ.. వాటి వాణిజ్యీకరణకు ఈ సంస్థ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ సందర్భంగా ‘CCO’ చేపట్టబోయే మొట్టమొదటి వినూత్న కార్యాచరణ ‘కలెక్టివ్ స్క్రిప్ట్-క్రియేషన్ మోడల్’ను కూడా అధికారికంగా ప్రకటించారు.
ఈ సరికొత్త జాతీయ సంస్థకు ఫౌండర్ ప్రెసిడెంట్‌గా వీర శంకర్, ఫౌండర్ జనరల్ సెక్రటరీగా పి.జి. విందా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఇందులో భారత క్రియేటివ్ ఎకోసిస్టమ్ లోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఫౌండర్ డైరెక్టర్లు పి.జి. విందా, పంజా శ్రవణ్ మాట్లాడుతూ.. ‘‘వేగంగా విస్తరిస్తున్న భారత క్రియేటివ్ ఎకానమీకి CCO ఒక కీలకమైన సంస్థ. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న అసోసియేషన్లు, గిల్డ్‌లు లేదా కౌన్సిళ్లకు CCO ప్రత్యామ్నాయం కాదు.. వాటన్నింటినీ ఒకే కొల్లాబరేటివ్ నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై అనుసంధానించి, నాలెడ్జ్ షేరింగ్ ద్వారా అందరూ కలిసి ఎదిగేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యం’’ అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
క్రేజీ అప్డేట్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో సూర్య.. ‘జై భీమ్’ కాంబో రిపీట్!
‘హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు!
పాతికేళ్ల తర్వాత... ఈ జన్మలోనే నాకు నచ్చిన పాత్ర చేశా- అన్నపూర్ణమ్మ