సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చాక్లెట్ స్టార్ పవన్ ‘పోతిరెడ్డిపల్లి’ ప్రారంభం.. హారర్ థ్రిల్లర్‌గా కొత్త సినిమా

ABN, Publish Date - Oct 06 , 2026 | 12:51 PM

చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న ‘పోతిరెడ్డిపల్లి’ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. మౌనిక, సిరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారర్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో అక్టోబర్ 5న పూజా కార్యక్రమాలతో చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు.

ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రారంభోత్సవానికి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, సీనియర్ నటుడు బాబుమోహన్ తదితరులు హాజరయ్యారు.

తొలి షాట్‌కు బాబుమోహన్ క్లాప్ కొట్టగా, అమ్మ రాజశేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలుగు మూవీ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. దర్శకులు వి. సముద్ర, ఓయూ శంకర్ గుండేటి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో పవన్ మాట్లాడుతూ.. కథకు తగ్గట్టుగా ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందిస్తున్నామని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. దర్శకుడు అశోక్ రోయ్య మాట్లాడుతూ.. ఇది తన రెండో సినిమా అని, కథను విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

గ్రామీణ నేపథ్యంలో మిస్టరీ, హారర్, సస్పెన్స్ అంశాలతో కథ సాగుతుందని చిత్రబృందం తెలిపింది. కథలోని ట్విస్టులు, పాత్రల చుట్టూ జరిగే పరిణామాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయని పేర్కొంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Updated Date - Oct 06 , 2026 | 03:29 PM