సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నా విజయ రహస్యం నువ్వే... చిరు ఎమోషనల్ పోస్ట్!

ABN, Publish Date - Feb 18 , 2026 | 01:50 PM

ఫిబ్రవరి 18న మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi - Surekha

ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని అంటారు. కొంతమంది జీవితంలో ఆమె తల్లి, మరికొంతమంది జీవితంలో ఆమె సోదరి అయితే... చాలామంది జీవితంలో మాత్రం భార్యే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం అదే మాట చెబుతున్నారు. ఫిబ్రవరి 18 ఆయన భార్య సురేఖ (Surekha) పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టారు.


భార్య సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియచేస్తూ ఆమె తన జీవితంలోకి అడుగుపెట్టిన నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇలా తన మనసులో మాటను వ్యక్తం చేశారు. '1980 ఫిబ్రవరి 20న మనం వివాహ బంధంతో ఒక్కటైన రోజు నుంచి నువ్వు నా జీవితంలో అతి పెద్ద బలంగా నిలిచావు. ఈ రోజు నీ పుట్టినరోజును జరుపుకుంటూ, త్వరలో రాబోయే మన వివాహ వార్షికోత్సవాన్ని ముందుగానే ఆహ్వానిస్తూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మన కుటుంబానికి నువ్వే కేంద్ర బిందువు. ప్రేమతో అందరినీ ఒక్కటిగా కట్టి పడేసే శక్తి నువ్వే. నా కుటుంబ సభ్యులను నీ సొంత వారిలా అంగీకరించి, ప్రతి సందర్భంలో వారికి అండగా నిలిచి, నా తల్లిదండ్రులకు నిజమైన కూతురిగా మారావు. వారు కూడా నిన్ను అంతే ప్రేమతో ఆప్యాయంగా ఆదరించారు' అని పేర్కొన్నారు.

అలానే తన విజయ రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే అది తన ప్రతిభ, తన కష్టం కాదని తన భార్య అని గర్వంగా చెబుతానని చిరంజీవి తెలిపారు. సురేఖ ప్రతి బాధ్యతను నిశ్శబ్దంగా, ధైర్యంగా భుజాన వేసుకుని ముందుకు సాగిందని, అందువల్లే తాను కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలిగానని చిరంజీవి పేర్కొనడం విశేషం. సురేఖ కేవలం తన భార్య మాత్రమే కాదని, తన బలం, ఆధారం, శాంతి అన్నీ ఆమే అని చిరంజీవి పేర్కొన్నారు. 'ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అది నీవల్లే' అంటూ సురేఖకు చిరంజీవి కితాబిచ్చారు.

Updated Date - Feb 18 , 2026 | 01:56 PM