స్మిత్ మచ్చార్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం: చిరంజీవి
ABN , Publish Date - Oct 03 , 2026 | 10:19 AM
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు.
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళుతున్న విమానం కూల్చేసేందుకు ప్రయత్నించిన కో-పైలట్ తనను అడ్డుకున్న పైలట్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మచ్చార్ ప్రస్తుతం అబుధాబిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడల్లా హనుమాన్ చాలీసా పఠిస్తానని, దేశానికి దూరంగా ఉన్నా సంస్కృతికి దగ్గరగా ఉన్నానని ప్రధాని మోదీకి ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం స్మిత్ మచ్చార్‌కు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
‘‘తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ (Smit Machchhar’ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. జై హనుమాన్!’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతకు ముందు ప్రధానితో ముచ్చటిస్తూ.. ‘‘విమానంలో నాపై కత్తిపోట్లు జరిగినప్పుడు.. ఓ వైపు నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. అదే సమయంలో ఇతరులు చనిపోకుండా చూడాలని నాకు తెలుసు. విమానం కిందికి జారిపోతోంది, నాకు చాలా గాయాలయ్యాయి. అయినా లేచి ఏదో ఒకటి చేయాలనుకున్నా. తీవ్రంగా ప్రయత్నించి కాక్‌పిట్ తలుపు తెరిచా. వెంటనే పరుగెత్తుకు వచ్చిన ప్రయాణికుల సాయంతో అందరినీ కాపాడగలిగాం’’ అని స్మిత్ మచ్చార్ తెలిపారు. తాను 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నానని, అందులో 11 ఏళ్లుగా కెప్టెన్ (ప్రధాన పైలట్)గా ఉన్నానని వివరించారు.
ఇవి కూడా చదవండి:
పబ్లిగ్గా బుగ్గగిల్లిన ఆకతాయి.. షాకైన హీరోయిన్.. వీడియో వైరల్
8 వారాల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా: డిస్ట్రిబ్యూటర్ల తీర్మానం
RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!