సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'బిగ్‌ బాస్‌' ఫేమ్‌ పునర్నవి ప్రేమ వివాహం!

ABN, Publish Date - Mar 21 , 2026 | 04:21 PM

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం పెళ్ళి చేసుకుంది. ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఆమె వివాహం జరిగింది. వెడ్డింగ్ ఫోటోస్ ను పునర్నవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Punarnavi Bhoopalam

మరో బిగ్ బాస్ (Biggboss) సుందరి పెళ్ళి పీటలు ఎక్కేసింది! 'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ అవికా గోర్‌ (Avika Gore) స్నేహితురాలిగా నటించింది పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam). తొలి చిత్రంతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. వెండితెరపై చలాకీగా కనిపించిన పునర్నవి భూపాలంలో ఓ మంచి నటి ఉందని దర్శక నిర్మాతలు గ్రహించారు. దాంతో ఆ తర్వాత ఆమె అనుదీప్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'పిట్టగోడ' (Pittagoda) లో నటించింది. అలానే 'మనసుకు నచ్చింది, సైకిల్‌' చిత్రాలలో యాక్ట్ చేసింది. తెలుగులో 'బిగ్ బాస్‌' షోలో పాల్గొనడంతో పునర్నవికి మరింత పాపులారిటీ లభించింది. ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళిపోయింది.


గత యేడాది డిసెంబర్‌లో తన బోయ్‌ ఫ్రెండ్‌ను పునర్నవి అభిమానులకు పరిచయంచేసింది. ఈ యేడాది ఫిబ్రవరిలో వీరి వివాహ నిశ్చితార్థం జరగ్గా, ఇప్పుడు పెళ్ళి అయినట్టుగా కొన్ని ఫోటోలను పునర్నవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వరుడు హేమంత్‌ వర్మ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్ అని తెలుస్తోంది. పునర్నవి వివాహం చేసుకుందని తెలియగానే తోటి నటీనటులు, బిగ్ బాస్‌ కంటెస్టెంట్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 04:21 PM