సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తిరుమలలో జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్‌ వివాహం!

ABN, Publish Date - Apr 30 , 2026 | 09:15 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కావ్య వివాహం బుధవారం రాత్రి తిరుమలలో జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Bellamkonda Srinivas Wedding

శ్రీనివాస కళ్యాణం పూర్తయ్యింది! గత కొన్ని వారాలుగా తెలుగు సినిమా రంగంలో ఎక్కడ విన్నా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పెళ్ళి ముచ్చటే! రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మొదలుకొని ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా రంగానికి చెందిన పెద్దలకు బెల్లంకొండ సురేశ్‌ దంపతులు కొడుకు శ్రీనివాస్‌తో సహా స్వయంగా పెళ్ళి శుభలేఖ అందించి, ఆశీస్సులు పొందారు. రోకా కార్యక్రమంలో మొదలైన ఈ వేడుక బుధవారం తిరుమలలో జరిగిన పెళ్ళితో పూర్తయ్యింది. తిరుమలలో సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్ళిలో తన ప్రియ సఖి కావ్యారెడ్డి మెడలో సాయి శ్రీనివాస్‌ మూడు ముడులు వేసి, అనంతరం ఏడు అడుగులు నడిచాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ పెళ్ళికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మే 1న హైదరాబాద్‌ వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరుగనుంది.

Updated Date - Apr 30 , 2026 | 09:29 AM