సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పవన్ అభిమాని నిరంజన్‌‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్

ABN, Publish Date - Jun 20 , 2026 | 01:24 PM

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ కుటుంబానికి చెప్పినట్లుగానే.. రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. స్వయంగా ఆయనే బాబు ఇంటికి వెళ్లి చెక్‌ని అందజేశారు.

Bandla Ganesh helps Pawan Kalyan Fan Niranjan

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ (Pawan Kalyan Fan Niranjan) కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శనివారం) హనుమకొండ, హనుమాన్ నగర్‌‌లోని బాలుడి ఇంటికి బండ్ల గణేష్ (Bandla Ganesh) వెళ్లారు. అక్కడ నిరంజన్‌ అండ్ ఫ్యామిలీతో మాట్లాడి.. బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున 5 లక్షల రూపాయల చెక్‌ను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

17 సంవత్సరాల నిరంజన్ అనే బాబు జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడని, తన దైవసమానులైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ బాబుని పలకరించడానికి హనుమకొండ వస్తున్నారని తెలిసి.. తనకు ఈ విషయం దృష్టికి వచ్చిందని బండ్ల గణేష్ చెప్పారు. ఆ బాబు పక్కనే ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమాలోని హీరో ఫోటో చూడగానే తన హృదయం చలించిందని, తన చేతనైన సహాయం ఉడతా భక్తిగా ఆ బాబుకు చేయాలనిపించిందని పేర్కొన్నారు. తామంతా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పవన్ కళ్యాణే కారణమని ఆయన అన్నారు.


ప్రస్తుతం తన కూతురి వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా ఈ రోజే రావడానికి ఒక కారణం ఉందని తెలిపారు. ఈ రోజు తనకు దైవసమానులైన నారా భువనేశ్వరి జన్మదినం కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రూ. 5 లక్షలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే తన హృదయం ఎంతో ఆనందపడుతుందని భావించి వచ్చినట్లు చెప్పారు. ఆ రూ. 5 లక్షలు బాబు తండ్రి పేరు మీద డిపాజిట్ చేసుకోమని చెప్పగా.. ఆ బాబు తనకు కారు కొనుక్కొని అందులో తిరగాలని ఉందని తన కోరికను బయటపెట్టాడని బండ్ల గణేష్ తెలిపారు. దాంతో ఆయన ‘ఈ ఐదు లక్షలతో కారు కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి. నాలాంటి అభిమానులు మీకు అండగా చాలా మంది ఉంటారు, మీరేం బాధపడొద్దు’ అని ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ బాబు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి సమక్షంలో తన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ తరఫున ఆ రూ. 5 లక్షల చెక్కును వాళ్ళ నాన్నగారికి అందజేశారు.


అనంతరం మీడియా రాజకీయాల ప్రస్తావన తీసుకురాగా.. తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి రాలేదని స్పష్టం చేశారు. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానినని, ఆయన వల్లే ఈ స్థితిలో ఉన్నానని చెబుతూ.. ఆయన ఇక్కడికి వచ్చి ఆ బాబుని చూశారు కాబట్టే అది తన దృష్టికి వచ్చిందని, అందుకే మానవత్వంతో ఈ సహాయం చేయడానికి వచ్చానని బండ్ల గణేష్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

కాలంతో పాటు అంతా మారిపోయింది: ఖుష్బూ

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

Updated Date - Jun 20 , 2026 | 01:35 PM