సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆర్నా యాక్టింగ్‌ చూసి చంద్రబాబు ఖుషీ!

ABN, Publish Date - Jun 26 , 2026 | 01:39 PM

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. 'చిట్టి కలెక్టర్' ఆర్నా వీడియోనే తెగ హల్‌చల్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ వీడియోనే చక్కర్లు కొడుతోంది. ఆ క్యూట్ వీడియోను చూసిన ఏపీ సీఎం చంద్రబాబు తెగ నచ్చేయడంతో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అది టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సీఎం మనసును అంతలా దోచుకున్న వీడియోలో ఇంతకూ ఏముంది!?

రాజకీయ సమావేశాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు... ఈసారి మాత్రం ఓ చిన్నారి క్యూట్ వీడియో చూసి నవ్వేశారు. అంతేకాదు... ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ప్రత్యేకంగా ప్రశంసించడంతో 'చిట్టి కలెక్టర్' ఆర్నా ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది.


ఈ వైరల్ వీడియోకు ప్రేరణగా నిలిచింది విక్టరీ వెంకటేశ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా. ఈ మూవీలో హీరోయిన్‌ను నమ్మించడానికి ఓ రేంజ్‌లో అబద్ధం చెబుతాడు వెంకటేశ్‌. తాను వైజాగ్‌కు కలెక్టర్‌గా పనిచేస్తున్నానని.. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగా.. బయట తన తండ్రి పడిగాపులు కాస్తున్నాడని తెలిసి మీటింగ్ మధ్యలోనే వచ్చేసినట్లు ఒక ఫన్నీ స్టోరీ అల్లుతాడు. సరిగ్గా ఇదే సీన్‌ను బేస్ చేసుకుని.. చిన్నారి ఆర్నా తండ్రి ఏఐ సాయంతో క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

వీడియోలో వైజాగ్ జిల్లా కలెక్టర్ సీట్లో దర్జాగా కూర్చున్న ఈ బుజ్జాయి.. సాక్షాత్తూ సీఎంతోనే కాన్ఫరెన్స్‌లో ఉన్నట్లు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. తాను లోపల మీటింగ్‌లో ఉంటే.. బయట తండ్రి వెయిట్ చేయడంపై ఆ పాప వెంకీ డైలాగ్స్‌కు సింక్ చేస్తూ పలికించిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవెల్... అంతే. ఈ చిట్టి కలెక్టర్ నటనకు ఫిదా అయిపోయిన చంద్రబాబు నాయుడు ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండటం ఎవరి తరం కాదు... తాను కూడా ఆర్నాకు పెద్ద ఫ్యాన్ అయిపోయానంటూ ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తనపై వచ్చిన ఒక మీమ్‌ను ఇంత సరదాగా, స్పోర్టివ్‌గా తీసుకుని షేర్ చేయడంతో నెటిజన్లు చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయనలోని స్పోర్టివ్ స్పిరిట్‌ ని మెచ్చుకోవడంతో పాటు లీడర్ అంటే ఇలా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇంత సరదాగా స్పందించడం గ్రేట్ అనేస్తున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలతో చేసిన ఇలాంటి క్యూట్ వీడియోలను కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

Updated Date - Jun 26 , 2026 | 01:45 PM