సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాట్ ఈజీ.. కానీ, రోజూ ఒక గంటసేపు చేయండి: అనసూయ

ABN, Publish Date - Jul 18 , 2026 | 01:52 PM

వయసు పెరుగుతున్న కొద్దీ తన అందంతో కుర్రకారును కట్టిపడేసే హాట్ బ్యూటీ అనసూయ, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Anasuya Bharadwaj

యాంకర్ కమ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గ్లామర్ గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ తన అందంతో కుర్రకారును కట్టిపడేసే ఈ హాట్ బ్యూటీ, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫిట్‌నెస్ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. జిమ్‌లో చెమటలు చిందిస్తూ, ఒళ్లంతా హొయలు పోతూ చేసిన వర్కవుట్ వీడియోను చూపిస్తూ.. తను ఫాలో అయ్యే సీక్రెట్‌ను తనదైన స్టైల్లో రొమాంటిక్ అండ్ ఎనర్జిటిక్‌గా వివరించింది.


వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. ‘‘ఉదయాన్నే లేవడం, వర్కవుట్ చేయడం అంత ఈజీ కాదు బాస్! చాలా మంది ఇవాళ వద్దులే రేపు చేద్దాం అని సాకులు వెతుకుతుంటారు. కానీ, ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం అసలు ఆపలేరు. రోజూ మీ అందమైన శరీరం కోసం కనీసం ఒక గంట సమయం కేటాయించండి, కుదిరితే గంటన్నర చేయండి’’ అంటూ కనుసైగలతో ఊరిస్తూ చెప్పింది. జిమ్ సూట్‌లో యమ హాట్‌గా కనిపిస్తూ, బరువులు ఎత్తుతూ, స్కిప్పింగ్ చేస్తూ ఆమె ఇచ్చిన పోజులు చూస్తే ఎవరికైనా ఫిట్‌నెస్‌పై క్రష్ కలగడం ఖాయం. ముఖ్యంగా మహిళల్లో లోయర్ బాడీ ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో చెబుతూ, పెల్విక్ ఏరియా, ఇన్నర్ థైస్ కోసం తను చేసే స్పెషల్ వర్కవుట్స్‌ను కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించేలా నేర్పింది.


ఇక వర్కవుట్ తర్వాత వచ్చే ఆ స్వేద బిందువులను తుడుచుకుంటూ, డ్రై అయిన తన గొంతును తడుపుకోవడానికి నీటిని సిప్ చేస్తూ కెమెరా ముందు ఆమె పలికించిన హావభావాలు వీడియోకే హైలైట్‌గా నిలిచాయి. ఆ తర్వాత తన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ను చూపిస్తూ.. మెంతి నీళ్లు, నానబెట్టిన నట్స్, బ్లూబెర్రీస్, వాల్‌నట్స్‌తో పాటు స్పినాచ్ అండ్ మష్రూమ్ ఆమ్లెట్ తింటూ కనిపించింది. ‘‘ఒకప్పుడు బఫే చూస్తే టెంప్ట్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు నా హెల్త్ నా చేతుల్లో ఉంది. టొమాటోలు నాచురల్ సన్‌స్క్రీన్ లాంటివని మీకు తెలుసా?’’ అంటూ కవ్విస్తూ తింటోన్న అనసూయ లుక్స్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

KJQ: ‘కింగ్ జాకీ క్వీన్’ రిలీజ్ ఖరారు.. ఎప్పుడంటే

చిరుకి వదినగా చేసినా.. నాగ్‌ ఫ్యామిలీతోనే బాండింగ్ ఎక్కువ: సుధ

ఫెడరేషన్‌‌కు షాకిస్తూ.. నిర్మాతలకు జానీ, సుమలత మాస్టర్స్ లేఖలు

Updated Date - Jul 18 , 2026 | 01:52 PM