కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షపై డాక్యుమెంటరీ.. ‘నాట్ ఏ మహాత్మా’ ట్రైలర్ విడుదల
ABN, Publish Date - Nov 25 , 2026 | 10:08 PM
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో ‘నాట్ ఏ మహాత్మా’ పేరుతో AI డాక్యుమెంటరీ సిరీస్ తెరకెక్కుతోంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
తెలంగాణ (Telangana ) తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష (Hunger Strike) నేపథ్యంలో నాట్ ఏ మహాత్మా (Not A Mahatma అనే డాక్యుమెంటరీ AI సిరీస్ రూపొందుతోంది.
'ఓయ్' ఫేమ్ ఆనంద్ రంగా (Anand Ranga) తెరకెక్కిస్తుండగా, పట్టాభి ఆర్ చిలుకూరి (Pattabhi R Chilukuri) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ డాక్యు సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. 'మా ఓయూ గడ్డ.. తెలంగాణ ఉద్యమాలకు అడ్డా' వంటి సంభాషణలతో ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది.
మొత్తం నాలుగు భాగాలుగా ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అహింసా మార్గంలో మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం తీసుకురాగా, అదే పంథాలో కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష వల్లే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా సిద్ధించింది. ఆ చారిత్రక దీక్ష వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటి? అనే కోణంలో ఈ సిరీస్ను రూపొందించనట్లు మేకర్స్ తెలిపారు.