సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగులో తొలి ఏఐ ఫీచర్ ఫిల్మ్‌ 'అంబ’s రివెంజ్'

ABN, Publish Date - Apr 02 , 2026 | 02:19 PM

ఏఐతో తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా ‘అంబ’s రివెంజ్’ – మహాభారత కథకు మోడర్న్ టచ్

తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త దిశగా అడుగులు పడుతున్నాయి. పూర్తిస్థాయి కృత్రిమ మేధ (AI) ఆధారంగా తెరకెక్కుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా “అంబ’s రివెంజ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోబోతోంది. సాంకేతిక విప్లవానికి నాంది పలికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. హనుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఇప్ప‌టికే విడుదలైన టైటిల్ పోస్టర్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది. విజువల్స్‌ నుంచే ఈ సినిమా ప్రత్యేకత స్పష్టమవుతోంది.

మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని, పౌరాణిక అంశాలను ఆధునిక టెక్నాలజీతో మేళవిస్తూ ఈ చిత్రాన్ని విభిన్నంగా మలుస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాణం, రాణి మాడిసన్ సహ నిర్మాణంలో శ్రీలలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాయి. జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక AI టూల్స్ వినియోగిస్తున్నామని వెల్లడించింది. పాత్రల డిజైన్, విజువల్ క్రియేషన్, కథనం రూపకల్పన వంటి విభాగాల్లో కొత్త తరహా ప్రయోగాలు చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 03:01 PM