సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు ఫ్యాన్స్ గొప్ప నిర్ణ‌యం.. హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్దతు

ABN, Publish Date - Apr 01 , 2026 | 12:47 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమాన సంఘం (AAFA) మరోసారి సామాజిక బాధ్యతను చాటుకుంది.

allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమాన సంఘం (AAFA) మరోసారి సామాజిక బాధ్యతను చాటుకుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. ఈ ఏడాది మొత్తం వివిధ కార్యక్రమాల ద్వారా హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రతి ఏడాది ఒక మంచి పని చేయాలన్న అల్లు అర్జున్ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా బాలికలు, మహిళల్లో కనిపించే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, యువతులు ఈ టీకాను తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంది.

అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం అభిమాన సంఘం తీసుకున్న మంచి నిర్ణయంగా అభినందనలు అందుకుంటోంది. స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మున్మందు ఆలాంటి కార్య‌క్ర‌మాలను కంటిన్యూ చేయాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 01:30 PM