సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: చిత్రసీమలో విషాదం... నటి వాహిని కన్నుమూత

ABN, Publish Date - Feb 05 , 2026 | 01:20 AM

పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన నటి వాహిని క్యాన్సర్ తో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Actress Vahini

తెలుగు సినిమా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని (Vahini) తుది శ్వాస విడిచారు. 1978లో జన్మించిన వాహిని, పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు. అలానే టీవీ సీరియల్స్ లోనూ కీలక పాత్రలు పోషించారు. బుల్లితెర వీక్షకులకు ఆమె జయ వాహిని పేరుతో పరిచయం. ఇటీవల విడుదలైన 'బహుర్బూమి' సినిమాలోనూ ఆమె నటించారు.

నరేశ్‌ విజయకృష్ణ టైటిల్ పాత్ర పోషించిన 'రఘుపతి వెంకయ్య నాయుడు' చిత్రంలో ఆమె కథానాయికగా చేశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో ఆమెకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా నటి కరాటే కళ్యాణి తోటి కళాకారులను, నటీనటులను కోరారు. ఆమె అభ్యర్థనకు స్పందించిన కొందరు సాయం చేశారు. అయినా వాహిని ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్ళమన్నారని, అలా స్వస్థలం విజయనగరం వెళ్ళిన ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని కరాటే కళ్యాణి తెలిపారు.

Updated Date - Feb 05 , 2026 | 01:22 AM