వరస్ట్ యానిమేషన్ అని ఎగతాళి చేశారు.. కట్ చేస్తే రూ. 8 కోట్ల కలెక్షన్లు
ABN, Publish Date - Aug 17 , 2026 | 06:38 PM
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్ ఎంతటి నష్టాన్ని తెచ్చిపెడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, అదే నెగిటివిటీ ఒక చిన్న యానిమేషన్ చిత్రం విషయంలో మాత్రం ఈ నెగెటివిటీనే కోట్లు కురిపించే అవకాశంగా మారింది.
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్ ఎంతటి నష్టాన్ని తెచ్చిపెడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, అదే నెగిటివిటీ ఒక చిన్న యానిమేషన్ చిత్రం విషయంలో మాత్రం ఈ నెగెటివిటీనే కోట్లు కురిపించే అవకాశంగా మారింది. ఆరంభంలో యానిమేషన్ క్వాలిటీ సరిగా లేదంటూ తీవ్రస్థాయిలో ఎగతాళికి గురైన ఆ సినిమా అనుకోని విధంగా కోట్లు రాబట్టి రికార్డులను షేక్ చేస్తోంది. ఆ సినిమా ఏంటి అంటే నియు లై (Niu Lai). ఇది ఒక చైనీస్ యానిమేషన్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యంలోకి ముంచేత్తేలా చేస్తోంది. దాదాపు 1 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 8 కోట్లు) వసూళ్లతో అద్భుత విజయాన్ని నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
కేవలం ఇద్దరు వ్యక్తులు దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి రూ. 1,680 యువాన్లు అంటే రూ. 20,000లతో అత్యల్ప బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రారంభంలో థియేటర్లలో కేవలం కొన్ని వేల యువాన్లు మాత్రమే రాబట్టిన ఈ చిత్రం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రూపురేఖలే మారిపోయాయి. ఈ సినిమాలోని క్లిప్పింగ్‌లను చూసిన నెటిజన్లు దీని యానిమేషన్ నాసిరకంగా ఉందంటూ, AI జనరేటెడ్ కంటెంట్‌లా ఉందంటూ విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ నెగెటివ్ పబ్లిసిటీయే సినిమాకు అతిపెద్ద అస్సెట్‌గా మారింది. నిజంగానే ఈ సినిమా అంత ఘోరంగా ఉందా అనే ఉత్సుకతతో జనాలు థియేటర్లకు క్యూ కట్టడం ప్రారంభించారు.
ప్రేక్షకుల నుంచి హఠాత్తుగా డిమాండ్ పెరగడంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా షోల సంఖ్యను భారీగా పెంచాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు ఏకంగా 6.8 మిలియన్ యువాన్లను దాటేసి 1 మిలియన్ డాలర్ మార్కుకు చేరుకున్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 8 కోట్లు రాబట్టింది. పెద్ద స్టార్లు, భారీ ప్రొడక్షన్ హౌస్ లేదా కోట్లు ఖర్చు చేసే ప్రమోషన్ క్యాంపెయిన్లు ఏవీ లేకుండా, కేవలం ఆన్‌లైన్ విమర్శలనే ప్రచార సాధనంగా మార్చుకుని ఇంత పెద్ద బాక్సాఫీస్ హిట్‌గా నిలవడం చైనీస్ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన విచిత్రంగా నిలిచిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. కొన్నిసార్లు ట్రోలింగ్ కూడా మంచికే అని ఈ సినిమా కలక్షన్స్ చూస్తే అర్ధమవుతోందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.