సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్పైడర్ మ్యాన్ వ‌చ్చేస్తున్నాడు! ట్రైల‌ర్ చూస్తే పూన‌కాలే

ABN, Publish Date - Mar 18 , 2026 | 06:23 PM

ఐదేళ్ళ విరామం త‌ర్వాత స్పైడ‌ర్ మాన్ : నో వే హోం చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన నూత‌న సినిమా స్పైడ‌ర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే.

ఐదేళ్ళ విరామం త‌ర్వాత స్పైడ‌ర్ మాన్: నో వే హోం (Spider-Man: No Way Home) చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన నూత‌న సినిమా స్పైడ‌ర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider Man: Brand New Day). దీనికి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ (Destin Daniel Cretton ) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 31న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. 2 నిమిషాల 40 సెక‌న్లు ఉన్న ఈ ట్రైల‌ర్ మూవీ కాన్సెప్ట్‌, సినిమా ఎలా ఉండ‌బోతుంది, స్పైడ‌ర్ మ్యాన్ ఎలాంటి పరిస్తితుల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌నే అంశాల‌ను తెలిపింది. రియ‌ల్ లైఫ్ ప్రేమ జంట టామ్ హాలాండ్ (Tom Holland), జెన్‌డ్యా (Zendaya) మ‌రోమారు ప్రేక్షకులను అల‌రించ‌నున్నారు.

గ‌త చిత్రం ‘నో వే హోమ్’ తర్వాత ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్‌ను మర్చిపోయిన పరిస్థితిలో ఈ చిత్రం కథ మొదలవుతుంది. ఈ నేప‌థ్యంలో తన అసలు గుర్తింపును దాచుకుని కేవలం స్పైడర్‌మ్యాన్‌గా మాత్రమే నగరాన్ని కాపాడుతూ ఒంట‌రిగా జీవిస్తూ ఉంటాడు. అంతేగాక.. పీటర్ నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి కాలేజ్ లైఫ్ మీద‌, జీవితం మీద దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తాడు. మ‌రోవైపు త‌ను ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రేయ‌సి త‌న‌ను ప‌ట్టించుకోకుండా మ‌రొక‌రితో ల‌వ్‌లో ఉండ‌డం త‌ట్టుకోలేక పోతుంటాడు.

కానీ అదే స‌మ‌యంలో నగరంలో అనుమానాస్పద, ప్ర‌మాద‌క‌ర‌మైన‌ క్రైమ్‌లు స్టార్ట్ అవుతాయి. ఆ పరిస్థితులు అతన్ని మళ్లీ యాక్షన్‌లోకి లాగుతాయి. కానీ అనుకోని ప‌రిస్తితుల్లో అత‌ని ప‌వ‌ర్స్ మాయ‌మ‌వ‌డం, అదృశ్య శ‌క్తి గా ఉన్న శ‌త్రువుతో పోరాడాల్సి రావ‌డం త‌ల‌కు మించిన స‌మ‌స్య‌గా మారుతుంది. ఈ క్ర‌మంలో స్పైడ‌ర్ మ్యాన్ ఆ శ‌త్రువుల‌ను ఎలా ఎదుర్కొన్నాడు, త‌న శ‌క్తుల‌ను తిరిగి ఎలా ద‌క్కించుకోగ‌లిగాడు, న‌గ‌రాన్ని, ప్ర‌జ‌ల‌ను ఎలా కాపాడాడనే క‌థ క‌థ‌నాల‌తో సినిమాను ఆద్యంతం అద్భుతమైన విజువ‌ల్స్‌, అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో రూపొందించారు. ముఖ్యంగా ట్రైల‌ర్ చివ‌ర‌లో వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశం క్లిప్ గూస్‌బంప్స్ వ‌చ్చేలా ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ఇప్పుడే ట్రైల‌ర్ చూసేయండి.

Updated Date - Mar 18 , 2026 | 07:46 PM