సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పాల్ అట్రైడీస్.. డ్యూన్‌3 ట్రైల‌ర్! విజువ‌ల్స్.. మైండ్‌బ్లోయింగ్ అంతే

ABN, Publish Date - Mar 18 , 2026 | 08:04 PM

ప్ర‌పంచ హాలీవుడ్ సినిమా ల‌వ‌ర్స్‌ను అల‌రించేందుకు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క భారీ అడ్వంజ‌ర‌స్ సైన్స్ ఫిక్షన్ సినిమా సిద్ధ‌మైంది.

dune

ప్ర‌పంచ హాలీవుడ్ సినిమా ల‌వ‌ర్స్‌ను అల‌రించేందుకు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క భారీ అడ్వంజ‌ర‌స్ సైన్స్ ఫిక్షన్ సినిమా సిద్ధ‌మైంది. 2021లో వ‌చ్చిన డ్యూన్‌, 2024లో వ‌చ్చిన డ్యూన్ పార్ట్‌ 2 చిత్రాల సిరీస్‌కు కొన‌సాగింపుగా రూపొందిన డ్యూన్ పార్ట్‌3 (Dune: Part Three). తిమోతీ చలమెట్ (Timothée Chalamet), జెండయా (Zendaya), రెబెక్కా ఫెర్గూసన్ (Rebecca Ferguson), ఫ్లోరెన్స్ పగ్ (Florence Pugh), అక్వామెన్ హీరో జాస‌న్ మోమా, ఆన్య టేర్ జాయ్‌, రాబ‌ర్ట్ పాటిన్స‌న్‌ వంటి ఉద్దండ న‌టులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. డెనిస్ విల్లెనెయువ్ (Denis Villeneuve) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాగా.. ఈ ఏడాది డిసెంబ‌ర్ 18న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా మంగ‌ళ‌వారం రాత్రి ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్‌ చేశారు.

తిరిగి అరాకిస్ గ్రహాన్ని ద‌క్కించుకున్న పాల్ అట్రైడీస్ (Paul Atreides) ఫ్రెమెన్ ప్రజల నాయకుడిగా ఎదిగి, అ గ్రహంపై తన ఆధిపత్యాన్ని బలపరచుకుంటాడు. అదే స‌మ‌యంలో గ‌తంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ల‌క్ష్యంతో పాటు, విశ్వవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ కుట్రల మధ్య ప‌లు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదే స‌మ‌యంలో భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే భ‌యంక‌ర‌ యుద్దాల‌ను ముందుగానే క‌ల‌లో చూసే అట్రైడీస్ ఆ మహా యుద్ధాన్ని (జిహాద్) నివారించడానికి ప్రయత్నిస్తూనే దాని నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుంటాడు.

ఓ వైపు అతని బ‌లం పెరుగుతున్న కొద్దీ, అతనిని న‌మ్మే వారి ఆశలు, భయాలు రెండూ పెరుగుతాయి. మ‌రోవైపు త‌న ప్రేయ‌సి చానీ (Chani)తో సంబంధాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రేమ, అధికార దాహం, ధర్మం ఈ మూడింటి మధ్య పాల్ తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీసాయి, చివ‌ర‌కు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌చ్చిందనే సీట్ ఎడ్జ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా విజువ‌ల్ ఫీస్ట్‌గా సాగుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ చూస్తే ఈ అంశాల‌ను అన్నింటినీ ట‌చ్ చేశారు. మీరూ ట్రైల‌ర్పై ఓ లుక్ వేయండి మ‌రి.

Updated Date - Mar 18 , 2026 | 08:04 PM