Street Fighter: గేమ్ కాదు.. ఈసారి బిగ్ స్క్రీన్ ఫైట్!

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:50 PM

ఆంగ్ల చిత్రం 'స్ట్రీట్‌ ఫైటర్' ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. అక్టోబర్‌ 16న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ తెలుగు ట్రైలర్ నూ తాజాగా రిలీజ్‌ చేశారు.

Street Fighter Movie

ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’. అక్టోబర్‌ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ సైతం విడుదలైంది.


1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో తొలిసారిగా ‘ప్లే చేయగలిగే ట్రైలర్’గా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్ట్రీట్‌ ఫైటర్ కాంబో ఛాలెంజ్‌ ద్వారా అభిమానులు ట్రైలర్ ను చూస్తూనే గేమ్ ఆడే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్

ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండ‌గ‌.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

Updated Date - Sep 02 , 2026 | 03:52 PM