సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Stranger Things: స్ట్రేంజర్ థింగ్స్ యూనివర్స్ లో కొత్త అడ్వెంచర్స్‌

ABN, Publish Date - Jan 02 , 2026 | 06:37 PM

అయిపోయింది... ఇక అంతా అయిపోయింది అనుకున్నారంతా. ఇకపై తమ అభిమాన సీరిస్ ను చూడలేమని ఎంతో బాధపడ్డారు. మళ్లీ అలాంటిది ఎప్పుడు వస్తుందో అని నిట్టూర్పులు విడిచారు. కానీ నెట్ ఫ్లిక్స్ కరుణించింది.. వారి కోరికను మరో రూపంలో నెరవేర్చేందుకు రెడీ అయింది.

'స్ట్రేంజర్ థింగ్స్'... ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వీక్షకులు చర్చించుకుంటున్న సీరిస్. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న దీని ఫైనల్ సీజన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆఖరి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఆడియెన్స్ ఎగబడి చూస్తున్నారు. దీంతో నెట్ ఫ్లిక్స్ షేక్ అవుతోంది. అయితే ఈ లాస్ట్ ఎపిసోడ్‌ తో ఈ వెబ్ సిరీస్ ముగియడంతో చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. తమను ఎంతగానో అలరించిన ఈ వెబ్ సీరిస్ ను ఇకపై చూడలేమా!? అని ఫీల్ అవుతున్నారు. అయితే వారికి ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ చెప్పింది నెట్ ఫ్లిక్స్.


'స్ట్రేంజర్ థింగ్స్' యూనివర్స్‌ ను ఎక్స్ టెండ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఒక కొత్త యానిమేటెడ్ సిరీస్‌ను తీసుకొస్తోంది. 'స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85' పేరుతో దీన్ని రూపొందిస్తోంది. ఇది మెయిన్ సిరీస్‌కు నేరుగా కొనసాగింపు కాకపోయినా, అదే ప్రపంచంలో జరిగే కొత్త అడ్వెంచర్ తో మలుస్తున్నారు.

ఈ యానిమేటెడ్ షో 1985 వింటర్ సీజన్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. అంటే ఒరిజినల్ సిరీస్ సీజన్ 2 ముగిసిన తర్వాత, సీజన్ 3 ప్రారంభమయ్యే ముందు కాలంలో జరిగే సంఘటనలను చూపించనుంది. అందరికీ తెలిసిన పాత్రలు కొత్త మాన్ స్టర్స్ తో పోరాడుతూ, హాకిన్స్‌ను బెదిరిస్తున్న పారా నార్మల్ మిస్టరీని ఛేదిస్తారన్నమాట. ఈ సిరీస్ మొదటి సీజన్ ఇదే యేడాది సమ్మర్ లో రావచ్చని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా అభిమానులకు ఇది పండగలాంటి వార్తే.

Read Also: MSG: అనిల్‌ బల్ల గుద్దాడు.. నయన్‌ రూల్‌ బ్రేక్‌ చేసింది.. ఇక మోతే..

Read Also: Akhil - Naga Chaitanya: ఎవరికి రాసిపెడితే వారి చెంతకే చేరుతుంది..

Updated Date - Jan 02 , 2026 | 06:37 PM