సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆస్కార్‌: రెండు సినిమాలు టై.. ఇలా జరగడం ఏడోసారి

ABN, Publish Date - Mar 16 , 2026 | 09:52 AM

లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ మరోసారి తారల మెరుపులతో కళకళలాడింది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు ప్రముఖ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ హోస్ట్‌గా వ్యవహరించి తనదైన శైలిలో నవ్వులు పూయించారు.

లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ (Dolby Theater) మరోసారి తారల మెరుపులతో కళకళలాడింది. ఈ ఏడాది ఆస్కార్ (Oscar awards) వేడుకలకు ప్రముఖ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ హోస్ట్‌గా వ్యవహరించి తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై ఆయన వేసిన జోకులు అందరినీ ఆలోచింపజేశాయి. ఈసారి అవార్డుల రేసులో 'సిన్నర్స్‌', 'ఒన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనెదర్‌' (One battle after another) వంటి చిత్రాలు ప్రధాన పోటీదారులుగా నిలిచాయి.

ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా 'వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనెదర్‌' నిలిచి సంచలనం సృష్టించింది. ఈ సినిమా మొత్తంగా ఆరు కేటగిరీల్లో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. 'సిన్నర్స్‌' చిత్రంలో అద్భుత నటన కనబరిచిన మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది నల్లజాతీయులలో ఆయన ఒకరిగా చరిత్ర సృష్టించారు. 'హమ్నెట్‌' చిత్రంలో తన నటనతో మెప్పించిన ఐరిష్ నటి జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా నిలిచారు.. ఇక తన నాలుగో నామినేషన్‌లో ఎట్టకేలకు పాల్ థామస్ ఆండర్సన్ 'వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనెదర్‌' మూవీకి గాను ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. అవార్డు అందుకున్న సమయంలో ఆయన చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ కదిలించింది. సీనియర్ నటుడు షాన్ పెన్‌కు ఉత్తమ సహాయ నటుడిగా, 75 ఏళ్ల వయసులో 'అమీ మాడిగన్ వెపన్స్‌' మూవీకి ఉత్తమ సహాయ నటిగా అవార్డులు గెలుచుకున్నారు.

'సిన్నర్స్‌' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆటం డ్యూరాల్డ్ అర్కాపావ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ కేటగిరీలో ఈసారి ఒకే అవార్డును రెండు సినిమాలు పంచుకోవడం విశేషం. 'ద సింగర్స్‌', 'టూ పీపుల్‌ ఎక్స్‌ఛేంజింగ్‌ సలివా' చిత్రాలు సమానమైన ఓట్లు సాధించి సంయుక్తంగా విజేతలుగా నిలిచాయి. ఆస్కార్ చరిత్రలో ఇలా జరగడం ఇది ఏడవసారి.

కే పాప్ డీమన్‌ హంటర్స్‌ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ సినిమాగా నిలిచింది. ఇందులోని గోల్డెన్‌ అనే పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుని, ఈ ఘనత సాధించిన మొదటి K-POP సాంగ్‌గా నిలిచింది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం అవతార్‌ ఫైర్‌ అండ్‌ యాష్‌ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డును ఎగరేసుకుపోయింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక బలమైన భావోద్వేగం అని ఈ ఏడాది విజేతలు నిరూపించారు. మిస్టర్‌ నో బడీ ఎగైనెస్ట్‌ పుతిన్‌ వంటి డాక్యుమెంటరీల విజయం సమాజంలో సినిమా చూపే ప్రభావాన్ని గుర్తుచేసింది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతిభను గౌరవించే ఈ వేదిక మరో అద్భుతమైన ఏడాదికి తెరదించింది.

Updated Date - Mar 16 , 2026 | 10:43 AM