సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే.. తెలుగు ట్రైలర్! పార్క‌ర్ ఇర‌గ‌దీశాడు

ABN, Publish Date - Jun 18 , 2026 | 05:41 PM

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: No Way Home)చిత్రం నుంచి ఫైన‌ల్‌ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Spider Man

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: No Way Home)చిత్రం నుంచి ఫైన‌ల్‌ ట్రైలర్ తాజాగా విడుదలైంది. 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్' తర్వాత వస్తున్న ఈ కొత్త భాగానికి దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ (Destin Daniel Cretton) దర్శకత్వం వహించ‌గా..టామ్ హాలాండ్ (Tom Holland), జెన్‌డ్యా (Zendaya) మరోసారి తమ పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాదాపు రెండు నిమిషాల 37 సెకన్ల నిడివి గల ట్రైలర్‌లో కథకు సంబంధించిన ప్రధాన అంశాలను ఆసక్తికరంగా చూపించారు. గత చిత్రంలోని సంఘటనల తర్వాత ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్‌ను మరచిపోయిన పరిస్థితుల్లో కథ ప్రారంభమవుతుంది. తన అసలు గుర్తింపును ర‌హ‌స్యంగా ఉంచుకున్న పీటర్, కేవలం స్పైడర్‌మ్యాన్‌గా నగరాన్ని రక్షిస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు.

ఇంతలో నాలుగేళ్ల తర్వాత తిరిగి కాలేజ్ జీవితం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో నగరంలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద ఘటనలు అతడిని మళ్లీ యాక్షన్‌లోకి దిగేలా చేస్తాయి.పీటర్‌లో అతడే నియంత్రించలేని కొన్ని ఆశ్చర్యకరమైన శారీరక మార్పులు ప్రారంభమవుతాయి. అంతేగాక‌ నగరాన్ని భయపెడుతున్న, ఎవరూ చూడలేని ఒక కొత్త శక్తివంతమైన శత్రువు రంగప్రవేశం చేస్తాడు. తనలో జరుగుతున్న మార్పులతో పోరాడుతూ, తనకు ప్రియమైన వారిని రక్షించడానికి పీటర్ మరోసారి స్పైడర్‌మ్యాన్‌గా భారీ సవాల్‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది.

అనుకోని కారణాలతో తన శక్తులు తగ్గిపోవడం, కనిపించని శత్రువుతో పోరాడాల్సిన పరిస్థితిలో పీటర్ ఆ దుష్ట శ‌క్తుల‌ను ఎలా ఎదుర్కొన్నాడు? తన శక్తులను తిరిగి పొందగలిగాడా? నగరాన్ని ఎలా కాపాడాడు? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. త‌న పాత స్నేహితులు స్పైడ‌ర్ మ్యాన్‌ను గుర్తించ‌గ‌లిగారా లేదా అనే ఆస‌క్తి క‌ర స‌న్నివేశాల‌తో సినిమా ఉత్కంఠ‌గొలిపే సీన్ల‌తో తెర‌కెక్కించారు. విజువ‌ల్స్, యాక్ష‌న్ ఘ‌ట్టాలు సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ట్రైల‌ర్‌పై ఓ లుక్ వేయండి మ‌రి.

Updated Date - Jun 18 , 2026 | 05:41 PM