ఇదెక్కడి బ్యాటింగ్ రా.. స్పైడర్ మ్యాన్! అవతార్, అవెంజర్స్‌లకు.. టార్గెట్ మాములుగా లేదుగా
ABN, Publish Date - Aug 09 , 2026 | 09:10 PM
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇండియాలో రూ.400 కోట్ల గ్రాస్ దాటిన ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌పై కన్నేసింది.
హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మార్వెల్ కామిక్స్, అవేంజర్స్, అవతార్ సిరీస్ లకు మన వాళ్ళు ఇచ్చే ఆదరణ వేరే లెవల్లో ఉంటుంది. అయితే, గడిచిన కొద్ది కాలంగా ఇండియన్ మార్కెట్‌లోనే కాదు, గ్లోబల్ వైడ్‌గా కూడా మార్వెల్ సినిమాలకు క్రేజ్ కాస్త తగ్గుతూ వచ్చింది. కంటెంట్ రొటీన్‌గా మారడంతో అభిమానులు కూడా కొంత నిరాశ చెందారు. కానీ, ఆ డౌన్ అవుతున్న క్రేజ్‌ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేస్తూ, రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే (Spider-Man Brand New Day) మూవీ బాక్సాఫీస్ దగ్గర నిజమైన సునామీని సృష్టిస్తోంది.
విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, కేవలం పది రోజుల్లోనే అంతర్జాతీయంగా మైండ్ బ్లోయింగ్ రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా గ్లోబల్‌గా 1.2 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 11,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ పండితులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మార్వెల్ (Marvel) ఈజ్ బ్యాక్ అనిపించేలా ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూసి హాలీవుడ్ విశ్లేషకులు కూడా షాక్ అవుతున్నారు.
ఇక మన దేశ విషయానికి వస్తే.. మన దేశీ బిగ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తోంది ఈ హాలీవుడ్ వండర్. ఇప్పటికే భారతదేశంలో ఈ చిత్రం 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది! ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, త్వరలోనే 500 కోట్ల భారీ క్లబ్‌లో చేరడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. రిలీజ్ అయి పది రోజులు గడిచినా, క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికీ బుక్ మై షో లో గంటకు 27 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయంటే, మన దగ్గర స్పైడర్‌మ్యాన్ క్యారెక్టర్‌కు ఏ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉందో అర్థం చేసుకోవచ్చు!
బ్రాండ్ న్యూ డే భారతదేశంలో 500 కోట్ల మార్కును గనుక దాటితే, ఇప్పటి వరకు మన దేశంలో హాలీవుడ్ సినిమాలు నెలకొల్పిన ఆల్-టైమ్ రికార్డులన్నీ కనుమరుగైపోతాయి. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాను ఒకసారి గమనిస్తే అవతార్: ది వే ఆఫ్ వాటర్ రూ. 484 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అవేంజర్స్: ఎండ్ గేమ్ (Avengers Endgame) రూ. 442 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం మూడో స్థానంలో మన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా చూపిస్తున్న దూకుడు ఇలాగే కొనసాగితే, అవేంజర్స్, అవతార్ (Avatar The Way of Water) రికార్డులను దాటుకుని ఇండియాలో నెంబర్ 1 హాలీవుడ్ మూవీగా అవతరించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. మరి ఈ కొత్త స్పైడర్‌మ్యాన్ చిత్రం ఇండియాలో రూ. 500 కోట్ల మార్కును అందుకుంటుందో లేదో చూడాలి.