సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Masters of the Universe: హాలీవుడ్‌ సినిమాకు టాలీవుడ్‌ తారల సపోర్ట్‌..

ABN, Publish Date - May 21 , 2026 | 01:45 PM

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్‌ అండ్‌ ది మాస్టర్స్‌ ఆఫ్‌ ది యూనివర్స్’. ఇప్పుడీ చిత్రం భారతీయ సినీ ప్రియులను అలరించడానికి రెడీ అవుతోంది.

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్‌ అండ్‌ ది మాస్టర్స్‌ ఆఫ్‌ ది యూనివర్స్’ (Masters of the Universe). ఇప్పుడీ చిత్రం భారతీయ సినీ ప్రియులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లిష్‌ ట్రైలర్‌ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌ పేక్షకులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తెలుగు వెర్షన్‌కు హీరో హీ-మ్యాన్‌ పాత్రకు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్థార్థ (Nikhil Siddharth) వాయిస్‌ అందిస్తున్నారు. 'కార్తికేయ, కార్తికేయ 2, స్పై' సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌ ఇప్పుడు ఐకానిక్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇక విలన్‌ స్కెలెటర్‌ క్యారెక్టర్‌కు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్‌ వాయిస్‌ అందిస్తున్నారు. డంకన్‌ పాత్రకు సీనియర్‌ నటుడు రావు రమేష్‌ వాయిస్‌ ఇవ్వడం విశేషం. ఈ పవర్‌ఫుల్‌ తెలుగు వాయిస్‌ కాస్ట్‌ కారణంగా ‘ఎటెర్నియా’ ప్రపంచంలోని యాక్షన్‌, ఎమోషన్‌, ఫాంటసీ వంటి అంశాలు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవనున్నాయని మేకర్స్‌ చెబుతున్నారు. అమెజాన్‌ ఎంజీఎం స్టూడియోస్‌ నిర్మాణంలో, ట్రావిస్‌ నైట్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నికోలస్‌ గలిట్జైన్‌ ప్రిన్స్‌ ఆడమ్‌ హీ-మ్యాన్‌గా నటిస్తుండగా, కమిలా మెండెస్‌ టీలా పాత్రలో కనిపించనున్నారు. సోనీ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌ విడుదల చేస్తుంది. జూన్‌ 5న ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 

Updated Date - May 21 , 2026 | 02:16 PM