సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్ట్రీమింగ్ మార్కెట్‌లో సంచలనం

ABN, Publish Date - Feb 27 , 2026 | 07:11 PM

ఒక్క కంపెనీ కార్పొరేట్ యుద్ధానికి దారి తీసింది. ఆ కంపెనీ తమకు కావాలంటే తమకు కావాలంటూ దిగ్గజాలు పోటీపడ్డాయి. ఆ కంపెనీ కోసం ఏకంగా అమెరికా అధ్యక్షుడే రంగంలోకి దిగి డీల్ సెట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

హాలీవుడ్‌లో భారీ కార్పొరేట్ యుద్ధం ముగిసింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసే పోటీ నుంచి నెట్‌ఫ్లిక్స్ పూర్తిగా వెనక్కి తగ్గేసింది. గత డిసెంబర్‌లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ స్టూడియోలు, స్ట్రీమింగ్ బిజినెస్‌ను దాదాపు 82.7 బిలియన్ డాలర్లకు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మాలని ఒప్పందం కుదిరింది. కానీ పారామౌంట్ స్కైడ్యాన్స్ హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చి మొత్తం డీల్‌నే మార్చేసింది.


వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని 111 బిలియన్ డాలర్లకు కొనేస్తామని పారామౌంట్ ఆఫర్ చేసింది. దీంతో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ బోర్డు ఆ ఆఫర్‌ను బెస్ట్ అని ప్రకటించేసింది. ఆ డీల్‌కు మ్యాచ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌కు నాలుగు రోజుల సమయం ఇచ్చింది. కానీ నెట్‌ఫ్లిక్స్ సీఈఓలు టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ ఆ రేట్ దగ్గర డీల్ తమకు ఆర్థికంగా లాభదాయకంగా లేదని, తాము తప్పుకుంటున్నామని ప్రకటించారు. దీంతో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని పారామౌంట్ స్కైడ్యాన్స్ గెలుచుకుంది. అయితే దీని వెనుక మరో పెద్ద కథ నడిచింది.

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోందని తెలియగానే అమెరికా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ రంగంలోకి దిగింది. ఈ డీల్‌ను పరిశీలించాల్సి ఉందని ట్రంప్ ప్రకటించారు. ఇష్టం లేకపోయినా పారామౌంట్ స్కైడ్యాన్స్ నెట్ ఫ్లిక్స్ కంటే ఎక్కువ ఆఫర్ చేసి డీల్ క్లోజ్ చేసింది. ఈ డీల్ పై పారామౌంట్ స్కై డ్యాన్స్ సంతోషంగా ఉన్నా.. జనరల్ పబ్లిక్ మాత్రం నెట్ ఫ్లిక్స్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. స్ట్రీమింగ్ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ మోనోపలీ ఏర్పడకుండా అడ్డుకుందని అంటున్నారు. తాజా డీల్‌తో వార్నర్ బ్రదర్స్, హెచ్.బి.ఓ., సి.ఎన్.ఎస్. లాంటి భారీ బ్రాండ్‌లన్నీ పారామౌంట్ ఆధీనంలోకి వెళ్తున్నాయి. ఈ డీల్ 2026 చివరి నాటికి పూర్తవుతుందని అంచనా.

Updated Date - Feb 27 , 2026 | 07:44 PM