Michael: ఇది మాములు ఆట కాదు సామీ.. రికార్డులు తిరగరాస్తున్న 'మైఖేల్ జాక్సన్'
ABN, Publish Date - May 03 , 2026 | 08:52 AM
michael jackson biopic michael film box office jaafar jackson performance review
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ (Michael Jackson) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’ (Michael) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రిలీజైన పది రోజులు కూడా కాకముందే 'మైఖేల్' మూవీ కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు సాధించిన సెకండ్ బిగ్గెస్ట్ మ్యూజిక్ బయోపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం 400 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే స్పీడ్ లో 'బోహేమియన్ రాప్సోడీ' ని కూడా వెనక్కి నెట్టి నంబర్ వన్ గా నిలవడం పక్కా. ఇక అమెరికాలో కూడా ఎల్విస్ రికార్డులను తుడిచిపెట్టేసింది. ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడానికి, ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్.. ఆ సినిమాలో మైఖేల్ పాత్ర చేసిన యాక్టర్ ప్రాణం పెట్టి నటించడమే!.
మైఖేల్ జాక్సన్ క్యారెక్టర్ లో నటించింది మరెవరో కాదు.. స్వయానా మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ (Jaafar Jackson). మైఖేల్ అన్నయ్య జెర్మైన్ జాక్సన్ (Jermaine Jackson) కొడుకే ఈ జాఫర్. ఒక గ్లోబల్ ఐకాన్ బయోపిక్ అనగానే ఎవరిని తీసుకుంటారా అని అంతా వెయిట్ చేశారు. డైరెక్టర్ ఆంటోనీ ఫుక్వా వరల్డ్ వైడ్‌గా ఎంతో మందిని ఆడిషన్ చేసి ఫైనల్‌గా జాఫర్‌ని సెలెక్ట్ చేశాడు. జాఫర్‌కి చిన్నప్పటి నుంచే సింగర్‌గా, డాన్సర్‌గా మంచి ట్రైనింగ్ ఉంది. పైగా మైఖేల్ జాక్సన్ పోలికలు, బాడీ లాంగ్వేజ్ నాచురల్ గానే జాఫర్‌కి ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది.
జాఫర్‌కి యాక్టర్‌గా ఇదే డెబ్యూ మూవీ కావడం విశేషం. ఇక జాఫర్ యాక్టింగ్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. తెరపై తను యాక్ట్ చేయలేదు.. ఏకంగా మైఖేల్ లాగా మారిపోయాడు. ఈ క్యారెక్టర్ కోసం జాఫర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. షూటింగ్ కు ముందు ఏకంగా ఒక ఏడాది పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మైఖేల్ సిగ్నేచర్ డాన్స్ స్టెప్స్ నేర్చుకోవడానికి తన కాళ్ల నుంచి రక్తం వచ్చేంతలా ప్రాక్టీస్ చేశాడు. స్క్రీన్ టెస్ట్ లోనే అచ్చం మైఖేల్ లాగా మారిపోయి క్రూ మెంబర్స్ అందరినీ షాక్ కి గురిచేశాడు. పాటల్లో మైఖేల్ ఒరిజినల్ వాయిస్‌కు, తన వాయిస్‌ను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి పాత్రకు ప్రాణం పోశాడు.
సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌కు నిజంగానే మైఖేల్ జాక్సన్ లైవ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. తన మేనల్లుడు జాఫర్ రూపంలో పాప్ కింగ్ మళ్లీ బతికొచ్చాడంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. "నువ్వు మైఖేల్ లా యాక్ట్ చేయలేదు.. మైఖేల్ వే అయిపోయావు" అంటూ హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్స్ ప్రశంసిస్తున్నారు. అసలు జాఫర్ ఈ రోల్ చేస్తున్నాడన్న విషయం వాళ్ళ ఓన్ ఫ్యామిలీకి కూడా దాదాపు ఏడాది పాటు తెలియకుండా సీక్రెట్ గా ఉంచాడట. మొత్తానికి ఫస్ట్ సినిమాతోనే గ్లోబల్ సెన్సేషన్‌గా మారిన జాఫర్ జాక్సన్.. తన అద్భుతమైన యాక్టింగ్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాడు.