Kylie Jenner: ఒక్క బ్రా రూ.474 కోట్లు ఏంట్రా.. నరాలు కట్ అయ్యిపోతున్నాయిగా
ABN, Publish Date - Oct 19 , 2026 | 03:21 PM
సాధారణంగా అమ్మాయిలు వాడే లో దుస్తులు.. ముఖ్యంగా బ్రా ధర ఎంత ఉంటుంది.. ఒక వెయ్యి నుంచి స్టార్ట్ చేస్తే బ్రాండ్ అయితే 10 వేలు వరకు ఉంటుంది. లేదు.. బాగా ఎక్స్ పెన్సివ్ అయితే ఒక లక్ష అనుకోవచ్చు.
సాధారణంగా అమ్మాయిలు వాడే లో దుస్తులు.. ముఖ్యంగా బ్రా ధర ఎంత ఉంటుంది.. ఒక వెయ్యి నుంచి స్టార్ట్ చేస్తే బ్రాండ్ అయితే 10 వేలు వరకు ఉంటుంది. లేదు.. బాగా ఎక్స్ పెన్సివ్ అయితే ఒక లక్ష అనుకోవచ్చు. కానీ, ఎప్పుడైనా అక్షరాల రూ. 474 కోట్లు విలువ చేసే బ్రా గురించి విన్నారా.. ఒరేయ్ ఏం మాట్లాడున్నావ్ రా.. బ్రా రూ. 474 కోట్లు ఏంటి.. నరాలు కట్ అయిపోతున్నాయి అని షాక్ అవుతున్నారా.? అవును ఒక్క బ్రా విలువా అక్షరాల రూ. 474 కోట్లు. ఆ బ్రాను ధరించి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.. హాలీవుడ్ స్టార్, వ్యాపారవేత్త కైలీ జెన్నర్ (Kylie Jenner).
తాజాగా జరిగిన విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షో ర్యాంప్ పై కైలీ జెన్నర్ అత్యంత ఖరీదైన డ్రెస్సులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ పాపులర్ ఫాంటసీ బ్రాని ఆమె ధరించింది. కైలీ జెన్నర్ ధరించిన ఈ ఫాంటసీ బ్రా విలువ అక్షరాలా రూ.474 కోట్లు. ఆ బ్రాలో అంత స్పెషల్ ఏముంది అంటే.. ఈఫాంటసీ బ్రా కేవలం బ్రా మాత్రమే కాదు, ఒక అద్భుతమైన రత్నాభరణాల కళాఖండం . దీని మధ్యలో 75.54 క్యారెట్ల అరుదైన పసుపు వజ్రం ప్రధాన ఆకర్షణగా నిలవగా, దాని చుట్టూ దాదాపు 4,410 సహజ వజ్రాలను అత్యంత నైపుణ్యంతో పొదిగారు. 15 మంది నిపుణులైన రత్నకళాకారులు దాదాపు 1,000 గంటల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. దీని మొత్తం బరువు సుమారు 1.8 కిలోలు ఉంటుంది. అందుకే ఈ బ్రాకు అంత రేటు.
ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పటివరకు వచ్చిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆభరణాల్లో ఒకటిగా నిలిచిన ఈ బ్రా ధర విన్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. అంత ఖరీదైన ధరతో భారతదేశంలో ఎన్నో లగ్జరీ ఇళ్లు లేదా విల్లాలను కొనుగోలు చేయవచ్చంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో పాటు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియాస్ సీక్రెట్ రికార్డుల్లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రియేషన్గా నిలిచిపోయింది.