సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Spider-Man: Brand New Day Final Trailer: స్పైడర్-మ్యాన్ కొత్త ట్రైలర్.. హల్క్ ఎంట్రీతో పెరిగిన హైప్

ABN, Publish Date - Jul 23 , 2026 | 05:31 PM

మార్వెల్ స్టూడియోస్ 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదలయింది.

Spider-Man: Brand New Day Final Trailer

ఒడిస్సీ చిత్రం త‌ర్వాత ఇప్పుడు ప్ర‌పంచం అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man Brand New Day). డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్, జస్టిన్ కురిట్జ్‌కెస్ కథను అందించారు. కెవిన్ ఫైగీ, ఏమీ పాస్కల్, అవి ఆరాడ్, రాచెల్ ఓ'కానర్ నిర్మాతలుగా వ్యవహరించారు. టామ్ హాలండ్, జెండయా, సేడీ సింక్ వంటి స్లార్ల‌తో పాటు జేకబ్ బటాలన్, జాన్ బెర్న్తాల్, ట్రామెల్ టిల్మన్, మైకేల్ మాండో, మార్క్ రఫాలో కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారతదేశంలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన‌ ఫైనల్ ట్రైలర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టామ్ హాలండ్ (Tom Holland) స్పైడర్-మ్యాన్‌గా నటిస్తున్న నాలుగో సోలో మూవీ కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది. గ‌త మూవీ 'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' ముగింపు తర్వాత పీటర్ పార్కర్ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలే ఈ చిత్రానికి ప్రధాన నేపథ్యం.

ప్రపంచంలోని ప్రతి ఒక్కరి జ్ఞాపకాల నుంచి స్పైడ‌ర్ మ్యాన్‌ ఉనికి చెరిపి వేయబడిన తర్వాత పీటర్ ఒంటరిగా ఎదుర్కొన్న పరిస్థితులను ట్రైలర్‌లో హృద్యంగా చూపించారు. ముఖ్యంగా ఎంజేతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ అతను అనుభవించే భావోద్వేగాలు సినిమాకు ఎమోషనల్ టచ్ ఇవ్వనున్నాయని అర్థమవుతోంది. దాంతో పాటే యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌తో క‌ళ్లు చెదిరి యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అల‌రించ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. అంతేకాదు, మార్క్ రఫాలో హల్క్ పాత్రలో కనిపించనున్నట్లు ట్రైలర్‌లో అధికారికంగా చూపించి మార్వెల్ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా ఇచ్చారు. దీంతో ఈ సినిమా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.

Updated Date - Jul 23 , 2026 | 05:31 PM