సూపర్ గర్ల్.. కొత్త తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Apr 01 , 2026 | 12:12 PM
హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేందుకు చాలా గ్యాప్ తర్వాత ఓ సూపర్ హీరోయిన్ చిత్రం ముస్తాబవుతోంది.
హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేందుకు చాలా గ్యాప్ తర్వాత ఓ సూపర్ హీరోయిన్ చిత్రం ముస్తాబవుతోంది. మనకు అందరికీ సుపరిచితమైన సూపర్ మ్యాన్ సిరీస్‌లో భాగంగా ఫస్ట్ టైం సూపర్ మ్యాన్ చెల్లి నేపథ్యంలో ఓ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా సూపర్ గర్ల్ (Supergirl) తెరకెక్కింది. కొద్ది నెలల క్రితమే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదల చేశారు.
క్రిఫ్టో గ్రహం నుంచి వచ్చిన సూపర్ మ్యాన్ చెల్లికి అన్నలాగే సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ వాటికి దూరంగా తన కుక్క క్రిఫ్టోతో కలిసి హ్యాపీగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ క్రూరమైన విలన్ గ్యాంగ్ దాడిలో ఆ కుక్క చనిపోవడంతో తప్పని పరిస్థితిలో సూపర్ గర్ల్ రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సూపర్ గర్ల్ ఆ విలన్ గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొంది అనే ఆసక్తికరమైన కథ కథనాలు, కళ్లు చెదిరే విజువల్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్లతో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తెలుగు డబ్బింగ్ సైతం ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది.
అయితే గతేడాది వచ్చిన సూపర్ మ్యాన్ సినిమాలోనే సూపర్ గర్ల్ తన అన్న వద్దకు వచ్చే సీన్స్ తో చెల్లి పాత్రను పరిచయం చేసి మంచి హైప్ తీసుకువచ్చారు. ఇక.. డి.సి. స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ (Warner Bros Pictures) ఈ చిత్రాన్ని నిర్మించగా అనా నోగ్వేరా (Ana Nogueira) దర్శకత్వం వహించాడు. మిల్లీ ఆల్కాక్ (Milly Alcock) సూపర్ గర్ల్‌గా అదరగొట్టింది. జూన్ 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ మూవీ విడుదల కానుంది.